నా వ్యూహం నాకు ఉంది, సీట్లు విషయం నాకు వదిలేయండి అని చెప్పిన పవన్ కళ్యాన్ తీరా అసలు విషయం వచ్చేసరికి చంద్రబాబుకి తల వంచి 24 సీట్లు మాత్రమే తీసుకుని కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టాడు.. ఆఖరికి కాస్తో కూస్తో ఓట్లు గణనీయంగా ఉన్న నియోజకవర్గాలని సైతం టీడీపీకే వదిలి బలం లేని చోట సీట్లు తీసుకుంటూ వారి ఆగ్రహానికి గురయ్యాడు..
ఆఖరికి జనసైనికులే నిన్నటిరోజున నాదెండ్ల మనోహర్ మీద దాడి చేయడం , కందుల దుర్గేష్ దగ్గర పవన్ కళ్యాన్ టీడీపీకి జనసేను అమ్మేశాడని జన సైనికులు బహిరంగంగా విమర్శించడంతో .. పూర్తిగా కాపు సామాజిక వర్గంలో, అలాగే తనని నమ్ముతూ, భుజాన మోస్తూ వచ్చిన సినిమా అభిమానుల్లో పెల్లుబికిన ఆగ్రహాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగానే అభిమానులని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమానికి తెరలేపాడు
తొలుత జబర్దస్త్ ఆర్టిస్ట్ అయిన హైపర్ ఆదితో సెంటిమెట్ వీడియో వదిలిన నాగబాబు ఇప్పుడు వాళ్ళ అనుకూల చానల్స్ లో పవన్ కళ్యాన్ ఎన్నికల కోసం ఆస్తులని అమ్ముకుంటున్నాడని ఫీలర్స్ వదిలారు..ఇది కేవలం జనసైనికులని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడమే తప్ప మరొకటి కాదని కాపు సామాజిక వర్గంలోని పలువురి మాట . ఇలా దిగజారి రాజకీయాలు చేయాలా పవన్ కళ్యాణ్ అంటూ కాపు నేతలే వ్యాఖ్యాణించడం విశేషం .