సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జన సేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ 21 సీట్లలో పోటి అంటూ ప్రకటించి మేము ఇంకో 30 సంవత్సరాలు రాజకీయం చేస్తాము అంటూ ప్రగల్భాలు పలికి తన జీవితం రాజకీయాలకు అంకితం అంటూ ప్రచారంలో భాగంగా చెబుతూ తీరా ఎన్నికలు రాగానే పగలు పిఠాపురం లో వుంటూ రాత్రికి హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు. ఇలా దేనికి చేస్తున్నారు అని చూస్తే పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ లకు వెళ్ళి వస్తున్నాడు మరొక కారణం పిఠాపురంలో తనకు వుండటానికి అనుకూలంగా లేదు కాభట్టి అలా వెళ్లి వస్తున్నాడు అని జన సేన పార్టీ వర్గాలు అంటున్నాయి.
సంవత్సరానికి ఓ ఇరవై సార్లు మాత్రమే ఏపీ కి వచ్చే పవన్ కళ్యాణ్ ఇలాంటి షెడ్యూల్ తో తనని నమ్ముకున్న ప్రజలకు పార్టీ కార్యకర్తలకు ఏ రకంగా అందుబాటులో వుంటారు ప్రజలకు ఏమి సేవ చేస్తారు. ఒక్క వారం రోజులు కాదు కాదా ఒక్క రోజు కూడా కుదురుగా ఏపీలో వుండలేని పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు రేపు రాజకీయంగా ఏ విధంగా సేవ చేస్తారు అని పిఠాపురం ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కీలక సమయంలో కూడా తనని నమ్ముకున్న అభ్యర్థి తరుపున ప్రచారాలు చెయ్యకుండా , తాను పోటీ చేస్తున్న పిఠాపురంకు ఉదయం రావడం గుళ్ళు గోపురాలు తిరగడం నాలుగు మాటలు మతాల మధ్య కులాల మధ్య గొడవలను పెట్టే విధంగా రెచ్చ గొట్టే మాటలు మాట్లాడటం, మధ్యాహ్నం ఒక ఫంక్షన్ హాల్ లో తన కుల పెద్దలతో మాట్లాడటం ఓ నాలుగు సినిమా డైలాగులు చెప్పడంతో సరిపోయింది. రాత్రికి ఏమో సినీమా షూటింగ్ లు అని హైదరాబాద్ చెక్కేస్తున్నరు. ఇంకా ఎప్పుడు ప్రచారం చేసి ప్రజల దగ్గరకు వెళ్తారు. ప్రజలను కలిసి పవన్ కళ్యాణ్ ను ఎందుకు గెలిపియ్యలని కోరుతారో అంటూ ముఖ్య కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఇలా సినీమా షూటింగ్ ల పేరుతో హైదరాబాద్ తిరిగి వస్తు వుంటే నాన్ లోకల్ అని మనకు అందుబాటులో వుండడు అని పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను పట్టించుకోరు మళ్ళీ 2019 లో భీమవరం, గాజువాక లో ఓడిపోయినట్టు ఓడిపోవడమే అని పిఠాపురం జన సేన నాయకులు పార్టీ పెద్దలతో చెప్పుకొని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చిత్తశుద్ధితో కొద్ధిగా సీరియస్ గా పని చెయ్యమని కోరుకుంటున్నారు .