ఇల్లేమో దూరం, గతుకులు, గాఢాంధకారం, గుండెల్నిండా ధైర్యం, సముద్రం కాళ్లదగ్గర మొరగదు, పర్వతం వంగదు, తూఫాన్ చిత్తం అనదు, దేశపు జెండాకు ఉన్న పొగరు, జన “సైనికులు”, “వీర” మహిళలు , చేగువేరా, యుద్ధమిస్తా , పరిగెత్తిస్తా .తాటా తీస్తా, తోలు వలుస్తా.
అర్థమయ్యుంటుంది అంత అంత ఘనమైన పదాలను అలవోకగా వల్లించే ఆయనెవరో ..
అలాంటి పెద్ద పెద్ద పదాలు ఒకరు వాడినవో, రాసినవో .., అలా అలవోకగా వల్లించే మాటలకూ 2019 లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడినా, పోటీ చేసిన అత్యధిక స్థానాల్లో డిపాజిట్లు దక్కకపోయినా, పార్టీ స్థాపించిన 10 ఏళ్లకు కేవలం 15 శాతం సీట్లలోనే పోటీ చేసేవాడు మాట్లాడవలసిన మాటలకు ఎంత వైరుధ్యమో అర్థం చేసుకోలేని వెర్రిబాగులోడు ..
అధః పాతాళానికి తొక్కే వామనుడి పాదం నాది అని గొంతుచించుకున్నాడే కానీ 2019 లో అతన్నే పాతాళానికి చేర్చిన ఘోర పరాజయం, ప్రత్యర్థిని ఆకాశానికి చేర్చిన 151 సీట్ల గెలుపు, 2024 లో బరిలో నిలవటమే పాతాళానికి దగ్గరగా ఉన్న కేవలం 15 శాతం లోపు సీట్లలో , అక్కడ 175 సీట్లపోటీతో ఆకాశాన ప్రత్యర్థి పార్టీ.. ఒక పాతాళములో కూరుకుపోయినోడు ఆకాశములో ఉన్నోడిని మరి ఎలా పాతాళానికి తొక్కుతాడో అనేది వెర్రిబాగులోడికి అర్థం కాని ఒక వైరుధ్యం ..
నేనంటే అంటే ఆంధ్ర ప్రజల భవిష్యత్తు, ఈదేశపు యువత కలలు, అర్థరాత్రి ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకొనే అంబులెన్స్ .. ఇలా మాట్లాడుతూ పోయాడు .., కానీ అంతలోనే .., తనను ఉత్సాహపరిచే , తననే ఉరకలు పెట్టించే రాజకీయ ఉద్ధండుడు మాత్రం చంద్ర బాబట .. వింతేమిటంటే ఆ బాబే.. మీరు నాతో పొత్తు పెట్టుకోండి నన్ను గెలిపించండి అని ఆపార్టీ ఈ పార్టీలను దీనంగా అడుక్కునే పనిలో ఉండటం ఈ వెర్రిబాగులోడికే అర్థం కాని వైరుధ్యం.
నేను ప్రత్యర్థికి ఎన్నికలలో భయంగొలిపే యుద్ధమిస్తా అని ఉరుముతాడు … కానీ అంతలోనే ఏమున్నాయి మనవద్ద, మనకు పోల్ మానేజ్మెంట్ తెలుసా, బూతు కార్యకర్తలెక్కడున్నారు, బూతు కార్యకర్తలకి అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నాం, మన నాయకత్వం ఇంకా ఎదుగుతాంది, వేచి ఉండాలి ఇంకా , అలాంటప్పుడు మనమెలా మొత్తం అన్ని సీట్లలో పోటీ చేస్తాం అంటూ దీనంగా వైరుధ్యంగా మాట్లాడే వెర్రి బాగులతనం తన సొంతం ..
ప్రత్యర్థి ప్రజాకంఠకుడు, దోపిడీదారుడు, అందరినీ హింస పెడుతున్న ధాష్టీకుడు అని అలవోకగా అనేస్తాడు ..కానీ మాకంటే ఆయనకే ప్రజల మద్ధతు ఎక్కువ అందుకే అతన్ని ఓడించటానికి మా పొత్తులు అనేస్తాడు .. ఈ వైరుధ్యానికి అర్థం తెలియని వెర్రిబాగులోడు
నాతో స్నేహమంటే చచ్చేదాకా అని ఎత్తుకొచ్చిన మాటలకు.. 2014 లో BJPతో, టీడీపీతో స్నేహం 2019 కి తాను బతుకుండగానే ఎలా చచ్చిందో, ఆ పిమ్మట కమ్యూనిస్టులతో స్నేహం ఎలా చచ్చిందనే వైరుధ్యం తెలియని వెర్రిబాగులోడు.
నాతో శత్రుత్వం అంటే అవతలి వాడు చచ్చేదాకా అని కూడా గొప్పగా రాసిన డైలాగు అయితే చెప్పాడు కానీ మరి 2019 లో శత్రువైన టీడీపీని 2024 లో బతికించటానికి పడుతున్న చీవాట్లేమిటో కూడా చెప్పుకొనే వైరుధ్యం తనలో ఉన్నదని గ్రహించలేని వెర్రిబాగులోడు ..
నేనేమి తప్పుచేశాను , నన్నెందుకు ప్రజలు నమ్మరు అనే ఆవేదన తన సొంతం .. కానీ అన్ని వైరుధ్యాలు గలిగినోడు వాటిని గ్రహించగలిగి నడవడిక మార్చుకోలేని వెర్రిబాగులోన్ని ప్రజలు ఆదరించరు అని తెలుసుకోలేని అధమస్థాయి వెర్రిబాగులోడి ప్రయాణం పదేళ్ల తర్వాత కూడా ఇంకా కాస్తో కూస్తో సాగుతోందంటే .. కారణం అలాంటి సమభావాలు కలిగిన కొందరు వెఱ్ఱి బాగులోళ్ల వల్లనేనేమో !