చంద్రబాబు తనకి విదిల్చిన ముష్టి 24 సీట్లను బట్టి తానో వామనుడని, జగన్‌ను “అదహః పాతాళానికి” (ఆయన అన్నట్టే) తొక్కేస్తాననీ… తన అన్నవరం సినిమా క్లైమాక్స్ పోతురాజులా తెగ ఊగిపోతూ ప్రసంగం చేసారు పవన్ కళ్యాణ్. మరి తక్కువ సీట్లు తీసుకున్నందుకు తనని తానే వామనుడని అభివర్ణించుకున్న పవన్‌కు వామనుడికి బానిస మనస్తత్వం లేదు అన్న విషయం తెలుసా??
బాలకృష్ణ ప్రసంగం మొదలుపెడుతున్నప్పుడు, పిలవకుండానే తాను కూడా లేచి ఇద్దరూ కలిసి ఫోటోలకు పోజులివ్వడంలో… చంద్రబాబు రాజకీయానికి బలి కాబోతున్న బానిసలా పవన్ కనపడ్డారు తప్ప వామనుడిలా కాదు. ఒకే వేళ వామనుడి అంశ అనే ఫీలయితే 24 కన్నా తక్కువ సీట్లు తీసుకుని… “ఇంకా చిన్న వామనుడిని” అని సరిపెట్టుకోవచ్చుగా??
ఒక పక్క కోపంతో ఉన్న కాపులను బుజ్జగించలేదు, తను టీడీపీ జెండా మోస్తుందే కాక, తన అభిమానులను జెండా కూలీలుగా మార్చినందుకు సముదాయించింది లేదు…. కానీ తనకి 24 సీట్లేనా అని వైసీపీ వాళ్ళు నిష్టూరపోతున్నారు అని ఆక్రోశం ఒకటి. త్రివిక్రమ్ రాసిస్తే స్వాతి పుస్తకంలోని కధలను కూడా సభా వేదికలపై ఇలానే ఊగిపోతూ చదవగలడు పవన్.
2019 లో కూడా జగన్ నిన్ను సీఎంను కానివ్వను అన్నాడు. సీయంను చేసేది జనాలు. అహం నిండిన పిల్ల పార్టీ నాయకులు కాదు. ఇపుడు కూడా అదేదో పాతాళానికి తొక్కేస్తా అంటున్నాడు, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది… ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది” అన్న చందాన. నాదెండ్ల పై కోపంతో దాడి చేసిన జన సైనికులు బాధ ఇంకా అర్థం అవలేదా ?? ప్రసంగం అంతా ఉడుకుమోత్తనంతో వచ్చిన విసుగులా ఉంది తప్ప, నిజంగా ఒక ప్రత్యర్ధిని వ్యూహాలతో దెబ్బ తీయడానికి సిద్ధమయిన పొత్తు రాజకీయంలా లేదు.