కొత్తవారికి టికెట్ లు ఇస్తా, యువతను నాయకులను చేస్తా, సామాన్యులను చట్ట సభల్లో కూర్చోబెడ్తా అంటూ ఎన్నెన్నో ఆదర్శ కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ఆచరణలో మాత్రం ముందు నుండే విఫలం అవుతున్నాడు. 2019 లో టీడీపీ నుండి వేరుగా పోటీ చేసినా, జనసేన అభ్యర్థుల అందరికీ బీ ఫామ్ లు టీడీపీ వారే ఇచ్చినట్లు టీడీపీ పార్టీ నేతలే స్వయంగా ఒప్పుకున్న సందర్భాలు ఎన్నో.
ఇక తాజా గా 2024 ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుంది. పొత్తులో భాగంగా ముందు 24 సీట్లకు ఒప్పుకుని బీజేపీ చేరికతో 24 కాస్త 21 అవ్వడం, ఆ 21 కూడా గ్యారెంటీ లేకపోవడం ఒక ఎత్తు అయితే ఆ పోటీ చేసే వాళ్లలో కూడా అంతా పాత సరుకే, సగానికి పైగా అభ్యర్థులు వివిధ పార్టీలలో టికెట్ రాక ఈ మధ్యనే జనసేన లో జాయిన్ అయిన వారే. ముందు నుండి పార్టీ ని పట్టుకుని వేలాడుతున్న అతి కొద్ది మందికి కూడా టికెట్ ఇచ్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో జనసేన ఉంది. బొలిశెట్టి లాంటి వాళ్లకి కూడా టికెట్ లేకపోవడం అందుకు నిదర్శనం.
ఒప్పుకుంది 21 సీట్లకు కాగా అందులో 15 స్థానాల్లో కూడా పోటీ చేసే స్థాయి లేదు అంటూ పవన్ కళ్యాణే పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాడు. ఆ 15 మందిలో కూడా టీడీపీ నుండి జాయిన్ వారికి, వైసీపీ నుండి జాయిన్ వారికి సగానికి పైగా సీట్లను ఖరారు చేసినట్లు సామాచారం. 2024 ఫిబ్రవరి వరకు టీడీపీ లో ఉన్న పులివర్తి అంజిబాబు కు పార్టీ లో జాయిన్ అయ్యి నెల తిరక్కుండానే భీమవరం సీటు, 2024 ఫిబ్రవరి వరకు వైసీపీ లో ఉన్న ఆరని శ్రీనివాసులుకు మార్చిలో జాయిన్ అయిన వెంటనే చిత్తూరు సీట్, 2024 ఫిబ్రవరి వరకు టీడీపీ లో ఉన్న గంటా నరహరికి మార్చిలో రాజంపేట సీటు కేటాయించడం తను చెప్పిన జెంపింగ్ లకి నా పార్టీ లో స్థానం లేదు అనే సిద్ధాంతానికి ఎంతో వ్యతిరేకం.
అంతేనా టీడీపీ డైరెక్షన్ లో కొణతాల రామకృష్ణకు, బొమ్మిడి నాయగర్ కు, వైసీపీ ఎంఎల్సీ గా ఉంటూ కనీసం రాజీనామా కూడా చేయకుండా పార్టీ లో జాయిన్ అయిన వంశీ కృష్ణ యాదవ్ కు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నాడు పవన్. మొత్తంగా 12 మంది కొత్తగా పార్టీ లోకి జాయిన్ అయిన వారికి అందునా టీడీపీ మనుషులకు సీట్లు కేటాయించి బాబు వ్యూహాన్ని అమలు చేస్తూ తన పార్టీని తానే భూస్థాపితం చేసుకుంటున్నాడు.