‘పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలంటే టైం పాస్ వ్యవహారం మాత్రమే. సీరియస్‌నెస్ ఉండదు. ప్రజారాజ్యం సమయంలో కావొచ్చు.. 2014లో జనసేన పెట్టిన నాటి నుంచి కావొచ్చు.. వీకెండ్ పొలిటీషియన్లాగే వ్యవహరిస్తున్నాడు. ఏనాడూ పూర్తిగా దృష్టి పెట్టలేదు. ఆయన చెప్పేవన్నీ కోతలే..’ సేన నుంచి వెళ్లిపోయిన అనేకమంది నేతలు చెప్పిన మాటలివి.
పవన్ చాలాసార్లు సినిమాలు మానేస్తున్నా.. ఇక ఈ జీవితం ప్రజలకే అంకితమని చెప్పారు. కానీ ఎప్పుడూ పాటించలేదు. తనకు వేరే ఆదాయం లేదని, మూవీస్ చేయడం తప్ప ఇంకేమీ తెలియదని కబుర్లు చెప్పేవాడు. 2019 ఎన్నికల సమయంలో సినిమాలు చేయనని ప్రకటించారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి సేనాని చేతిలో డజను సినిమాలున్నాయి. ఓ పక్క ఎలక్షన్ల హడావుడి జరుగుతోంది. సభల్లో రెచ్చిపోయి ప్రసంగిస్తున్నాడు. దీనిని అలాగే కంటిన్యూ చేస్తుంటే ఇబ్బంది లేదు. మరోవైపు తాపీగా తన సినిమా అప్డేట్లు ఇచ్చుకుంటున్నాడు.
డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్‌తో చాలాకాలం క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా మొదలుపెట్టారు. దీని షూటింగ్ ఆగుతూ సాగింది. ఏమైందో కానీ హరీష్ దీని సంగతి వదిలేసి వేరే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. అయితే ఇప్పుడు ఉస్తాద్ సినిమాపై అప్డేట్ వదిలాడు. 19వ తేదీన సినిమా కొత్త విషయం బయటికి వస్తుందంటూ పవన్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆశ్చర్యపడడం అందరి వంతైంది. ఈ మూవీ పట్టాలెక్కినందుకు కాదు. ఎన్నికలను సేనాని సీరియస్‌గా తీసుకోకుండా సినీ డబ్బింగ్ చెప్పడంపై అభిమానులే పెదవి విరుస్తున్నారు.
ఇప్పటికే సేనాని తీరుపై పార్టీలో చాలా అసంతృప్తి ఉంది. తను ఎదిగేందుకు చూడడని, చంద్రబాబు నాయుడి కోసం పనిచేస్తున్నారని విమర్శలున్నాయి. వారాహి యాత్ర పేరుతో కొంతకాలం హడావుడి చేసి మళ్లీ కనిపించలేదు. రాజకీయాలపై శ్రద్ధ పెట్టి సీఎం అయ్యే పని చూడకుండా సినిమాల మీద సినిమాలు మొదలు పెట్టడంపై అభిమానగణం గరం గరంగా ఉంది. ఇప్పుడు ఉస్తాద్ సినిమా అప్డేట్ను ఎవరూ అడగలేదని, కానీ అనవసరం వదిలారని కార్యకర్తలు బాధపడుతున్నారు. పవన్‌కు ప్రజల విషయంలో సీరియస్‌నెస్ ఉండదనే భావన అందరికీ కలుగుతుందని, దీంతో ఎన్నికల్లో నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీనికి రేపు ఎప్పుడైనా సభలో నేను ఏం చేసినా ప్రశ్నించేవారు నాకొద్దని హీరోగారు అన్నా అంటారు.