జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పూటకోమాట మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఒక్కోసారి ఒక్కో స్టేట్మెంట్ ఇస్తాడు. వేరే ప్రాంతంలో దానిని మార్చి చెప్పేసి సమర్థించుకుంటాడు. జనసైనికులు గొర్రెలు.. నేనేం చెప్పినా నమ్మేస్తారని ఆయన నమ్మకం కాబోలు.
ప్రజారాజ్యం ఎప్పుడో అమ్మేసిన దుకాణం. వైఎస్సార్ కాంగ్రెస్ కాకినాడ రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబును తిట్టడానికి మరోసారి పవన్ పీఆర్పీ పేరు ఎత్తాడు. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి మూలకారకుల్లో కన్నబాబు ఒకరని అన్నాడు. ఇంకా ఆయన్ను చులకన చేస్తూ మాట్లాడాడు. పీఆర్పీ దుకాణం ఎందుకు మూతపడిందో, ఎంత రేటు పలికిందో.. అప్పుడు జరిగిన పరిణామాలన్నీ సేనానికి తెలుసు. కానీ తన స్వార్థం కోసం నోటికొచ్చింది మాట్లాడేశాడు.
2014లో చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడనే కోపంతోనే నేను జనసేన పార్టీ పెట్టానన్నాడు పవన్. 2018లో మా అన్నయ్యకుS తెలియకుండా ప్రజారాజ్యాన్ని గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్‌కు అమ్మేశాడని వ్యాఖ్యానించాడు. నేడు కన్నబాబు కారణమని చెప్పాడు. నోటికొచ్చింది మాట్లాడడం పవన్‌కు వెన్నతోపెట్టిన విద్య.
నేను మెగాస్టార్‌ని.. అలా కనిపించగానే జనం ఓట్లు వేసేస్తారు. సీఎం అయిపోతానని భ్రమల్లో పడి పార్టీ పెట్టింది చిరంజీవి. ఈయన పేరు చెప్పుకొని అధికారాన్ని అనుభవించాలని సపోర్ట్ చేశారు మిగిలిన మెగా బ్రదర్స్, అల్లు అరవింద్ తదితరులు. అసెంబ్లీ, ఎంపీ టికెట్లు భారీ రేట్లకు అమ్ముకున్నారు. తీరా 2009 ఫలితాలు వచ్చాక అందరి మబ్బులు వీడిపోయాయి. ఆకాశంలో తేలియాడుతున్న చిరు నేలమీదకు దిగొచ్చాడు.
పార్టీని నడపలేక నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో మాట్లాడుకుని అమ్మేశాడు. రాజ్యసభ సభ్యత్వం తీసుకుని కేంద్ర మంత్రి అయ్యాడు. అసలు పీఆర్పీ రైట్స్ అన్నీ చిరువే. అమ్మేసి పదవి ఆయన తీసుకుంటే పవన్ మాత్రం మిగిలిన వారి మీద పడి ఏడుస్తుంటాడు. ముందు నిలదీయాల్సింది అన్నని. నువ్వు కాంగ్రెస్‌లో కలపకపోయి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు కదా అంటూ కాలర్ పట్టుకోవాలి. అలా కాకుండా నాడు నాయకుడిగా ఉన్న కన్నబాబు అంటే ఏమొస్తుందో.. గంటా కూడా కారణమని నాడు చెప్పి.. ఇప్పుడేమో అతనితో మంచి సంబంధాలు నడుపుతున్నాడు పవన్.
నేను పీఆర్పీ వ్యవస్థాపక సభ్యుడినని పవన్ అన్నారు. మరి అలాంటప్పుడు చిరంజీవి కాంగ్రెస్‌లో కలుపుతుంటే అడ్డు చెప్పకుండా ఏమి చేశావని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ప్రజారాజ్యం అమ్మేశాక వచ్చిన డబ్బులో పవన్ కూడా వాటా తీసుకున్నాడన్నది జగమెరిగిన సత్యం. అన్న కేంద్ర మంత్రి అయ్యాక పనులు చేయించుకుని లాభ పడ్డాడు. ఇప్పుడు కన్నబాబును ఏదో ఒక విధంగా తిట్టాలి కాబట్టి పీఆర్పీని అడ్డం పెట్టుకున్నాడు. కన్నబాబు.. ఇలారా అంటే పరిగెత్తుకొని వచ్చేవాడని పవన్ అన్నాడు. ఆయన ఎన్నో సంవత్సరాలు వివిధ హోదాల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఆత్మాభిమానం గల వ్యక్తి. కచ్చితంగా ఆ పని చేసి ఉండరు. కానీ సేనాని హేళనగా మాట్లాడాడు.
మా నాన్న చంద్రబాబు పిలవకపోయినా లగెత్తుకొచ్చి ఆయన మోచేతి నీళ్లు తాగే వ్యక్తి పవన్ అంటూ ఈ మధ్య నారా లోకేశ్ తన సన్నిహితులతో అన్నాడంట. దీని గురించి కాస్త చెప్పొచ్చుగా తమ్ముడూ..