ఎన్నికల అఫిడవిట్ అంటే పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిగత, వృత్తిగత జీవితాలకు సంబంధించిన అలాగే వారి ఆదాయ వ్యయాలకు సంబంధించిన పూర్తి నివేదికతో కోరిన సమాచారం. అది నూటికి నూరు శాతం కచ్చితంగానే ఉంటుంది, ఉండాలి అనేది సాధారణంగా ఎన్నికల అధికారులతో పాటు ప్రజలు కూడా నమ్మేటువంటి అంశం. నిబద్ధతతో కూడిన నివేదిక.. అయితే అలాంటి నివేదిక విషయంలోనే పవన్ కళ్యాణ్ నవ్వుల పాలయ్యాడు.
ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ పుట్టిన తేదీ, చదువు, ఆస్తులు అప్పులు ఇలా అన్ని అంశాలకు సంబంధించి తప్పుడు తడకలతో కూడిన నివేదిక సమర్పించాడు. పుట్టిన తేదీకి సంబంధించి చూస్తే పవన్ కళ్యాణ్ వయసు అఫిడవిట్ ప్రకారం 55 ఏళ్లు, వికీపీడియాలో మాత్రం 52 ఏళ్లుగా చూపిస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ వయసు 57 నుంచి 58 ఏళ్ళు ఉంటుంది. ఎందుకు అంటే 1984 లో 40 ఏళ్ల క్రితం ఎస్.ఎస్.ఎల్.సి పాస్ అయ్యాడు అంటే అప్పటికి పవన్ కళ్యాణ్ వయసు 15 నుంచి 17 ఏళ్ళు ఉండాలి. అలాగే తాను ఇంటర్మీడియట్ ఒకే సంవత్సరంలో ఎంపీసీ బైపీసీ ఎంఈసి గ్రూపులు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్, ఎన్నికల ఎఫెక్ట్ లో చూపించింది మాత్రం కేవలం టెన్త్ క్లాస్… ఇహ ఆదాయ వ్యయాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ తన ఆదాయం 114 కోట్లు అని, పన్ను చెల్లించింది 74 కోట్లు అని, దానాలు విరాళాలుగా ఇచ్చింది 20 కోట్లు అని, అప్పులు 64.26 కోట్లు అని వెల్లడించారు.
ఎన్నికల కోసం రెండు ఇల్లు అమ్ముకున్నాను అని తనకు అనుకూలంగా పనిచేస్తున్న ఎల్లో మీడియా అలాగే జనసేన సోషల్ మీడియా విభాగాల ద్వారా విస్తృత ప్రచారం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో చూస్తే ఆస్తులు అమ్ముకోకపోగా రెండు ప్రాపర్టీలు కొత్తగా కొన్నట్లు తేలింది. ఇలా ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ వాస్తవానికి విరుద్ధంగా తప్పుడు నివేదికను సమర్పించినట్లుగా తేటతెల్లమవుతుంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు సమర్పించినా ఈ సోషల్ మీడియా యుగంలో దాన్ని దాచుకోవటం అంత ఆషామాషీ కాదు అని తేలిపోయింది. నివేదిక సమర్పించిన మరుక్షణం అందులోని తప్పొప్పులను బేరీజు వేస్తూ వాస్తవానికి అవాస్తవానికి మధ్య గల తేడాను సాక్ష్యధారాలతో సహా ప్రజల ముందు ఉంచారు నెటిజన్లు. దీంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ నెట్టింట నవ్వులాటగా మారిపోయింది.