పవన్ 50 నుంచి 60 అసెంబ్లీ, పది వరకు పార్లమెంట్ సీట్లు తీసుకుంటాడు. చక్రం తిప్పుతాం. మమ్మల్ని ఎవడ్రా ఆపేది. కల్ట్ చూపిస్తామంటూ సోషల్ మీడియాలో జనసైనికులు రెచ్చిపోయారు. ఇప్పుడు వారే తమ అధినేతను తిడుతున్నారు.
‘రేయ్.. మా సేనాని అంటే ఏమనుకుంటున్నారు.. ఇది 2014, 2019 కాదు.. ఈసారి కుంభస్థలాన్ని కొడుతున్నాం. ఆయనే కాబోయే సీఎం. చంద్రబాబుతో మాకు అవసరం లేదు. ఆయనకే మా అవసరం ఉంది’ రాజమండ్రి జైలు వద్ద జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్ చూసి ఆ పార్టీ కార్యకర్తలు చెప్పిన డైలాగ్ ఇది. ఆ సమయంలో సేనానికి చేరో వైపు లోకేశ్, బాలకృష్ణ నిలబడ్డారు. దీంతో వారంతా మాపై ఆధారపడ్డారని విర్రవీగారు. తీరా సీట్ల ప్రకటనతో అందరూ ఢీలా పడిపోయారు.
పవన్ 50 నుంచి 60 అసెంబ్లీ, పది వరకు పార్లమెంట్ సీట్లు తీసుకుంటాడు. చక్రం తిప్పుతాం. మమ్మల్ని ఎవడ్రా ఆపేది. కల్ట్ చూపిస్తామంటూ సోషల్ మీడియాలో జనసైనికులు రెచ్చిపోయారు. ఇప్పుడు వారే తమ అధినేతను తిడుతున్నారు. కేవలం 24 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లు తీసుకోవడం.. అది కూడా ఐదు ఎమ్మెల్యే మాత్రమే ప్రకటించి మిగిలిన వాటి విషయంలో నాన్చుడు ధోరణి ప్రదర్శించడంతో అసంతృప్తికి లోనయ్యారు. సేనాని సీఎం కావాలని కార్యకర్తల ఆశ. ఈ విషయంలో తెలుగు తమ్ముళ్లతో ఫేస్బుక్, ట్విట్టర్లలో వాదులాడిన సందర్భాలున్నాయి. లోకేశ్ ఒకసారి బాబే సీఎం అభ్యర్థి అని, ఈ విషయంలో పవన్‌కి కూడా క్లారిటీ ఉందన్నాడు. అప్పుడు సేన కార్యకర్తలు రెచ్చిపోయి మేము ఒప్పుకోమని చెప్పారు. నేడు తక్కువ సీట్లకు పరిమితం కావడంతో ఇక సీఎం సీటు కోరిక నెరవేరదని తెలిసి ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.
సోషల్ మీడియాలో పవన్ అభిమానులే ఆయన్ను పిరికివాడని, బాబుకు అమ్ముడుపోయాడని విమర్శిస్తున్నారు. దీనికితోడు విలేకరుల సమావేశంలో సేనాని తక్కువ సీట్ల విషయపై విచిత్రమైన లాజిక్ చెప్పారు. జనసేన 24 స్థానాల్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ మనం చూడాల్సింది మూడు పార్లమెంట్ పరిధిలో అదనంగా 18 నుంచి 20 స్థానాలు యాడ్ అవడం. ఒకలా చూస్తే మేము 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లే లెక్క అని వ్యాఖ్యానించారు. ఇది కార్యకర్తలకు ఇంకా కోపం తెప్పిస్తోంది. శాసనసభ, పార్లమెంట్ సీట్లకు తేడా తెలియకుండా మాట్లాడినట్లు ఉందని సెటైర్లు వేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. వారు వేరే పార్టీల నాయకులైనప్పుడు మనమే ఉన్నామని ఎలా అనుకోవాలని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన వారిని మీరు మా జెండా కూలీలని సోషల్ మీడియాలో అంటుంటారు. దీనిని పవన్ నిజం చేసినట్లు అయింది.
ఇదిలా ఉండగా కొందరు పవన్ తీరును నిరసిస్తూ అభిమానులే సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాధ ఉంటే దాచుకోవాలని, అలా కాకుండా బయటకు చెబితే ప్రజల్లో చులకన అయిపోతామని హితబోధ చేస్తున్న పరిస్థితి ఉంది. 24 ఎన్నికల్లో పవన్ గబ్బర్ సింగ్లా సూపర్‌హిట్ కొడతాడని ఊహించుకున్న వారికి జానీ సినిమాతో సరిపెట్టేశాడు.