ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల వచ్చేశాయి. ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తాం అని ఎన్నికల కమిషన్ ఇప్పటికే తెలిపింది. ఆ దిశగా ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 18 నుంచి ఎన్నికల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు, ఏప్రిల్ 25వ తేది నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మే 13న ఎన్నికల పోలింగ్ , జూన్ 4న ఎన్నికల ఫలితాలతో ఈ ఎన్నికల షెడ్యూల్ ముగుస్తుంది.
ఏప్రిల్ 18 నుంచే ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండడంతో ఇప్పటికే అన్ని పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25 నామినేషన్లు దాఖలు చేస్తారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫున 22వ తారీకున వైయస్ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్లు వేస్తారు అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 22న నామినేషన్లు దాఖలు చేస్తారని తెలుగుదేశం పార్టీ ప్రకటన విడుదల చేసింది.
బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ నెల 19న రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం, ఆ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతారని సమాచారం.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఎప్పుడు నామినేషన్ వేస్తారనేది ఇంకా సరైన సమాచారం లేదు.