విశాఖ రానున్న 20 సంవత్సరాలలో అద్భుత ప్రగతి సాధించేలా ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తున్న నీతి ఆయోగ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ఆర్థికంగా అభివృద్ధి ముందుకు పడటానికి విశాఖపట్టణం ఒక వనరుగా మారనుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలంటే విశాఖ అనువైన ప్రదేశం అని అక్కడ ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలి అని నిర్ణయించంగా చంద్రబాబు & కో దీనికి అడ్డపడుతునే ఉన్నారు.ప్రస్తుతం ఏపికి ఆర్థిక రాజధానిగా పేరు ఉన్న విశాఖ అంతర్జాతీయంగాను ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఇలా ఉన్న విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పరిచి ముందుకు తీసుకొని వెళ్ళడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోనే ఆర్థిక పరివర్తన నగరాలను నాలుగు ఎంపిక చేయగా ముంబై, సూరత్, వారణాసిలోతో పాటుగా విశాఖ కూడా అందులో చోటు దక్కించుకుంది. దీంతో పలు భారీ ప్రాజెక్టులు, విదేశీ హంగులు రానున్నాయి. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కు విశిష్ఠత చేకూరింది. ఈ 4 నగరాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎకనామిక్ హబ్స్ గా కీలక పాత్ర పోషించే 20 నుంచే 25 పట్టణాలను గుర్తించే పనిలో నీతి అయోగ్ ఉన్నట్లు తెలిపింది. నీతి అయోగ్ గతంలో పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించే వారు , ఆర్థిక ప్రణాళికలు కాదు, కాగా ఇప్పుడు ఆర్థిక ప్రణాళికలు కూడా రూపొందించేలా నీతి అయోగ్ ఒక అడుగు ముందుకు వేసినట్లు నీతి అయోగ్ సీఈవో బి.వి.అర్ సుబ్రమణ్యం ప్రకటించారు.
ప్రస్తుత ఉన్న జగన్ ప్రభుత్వం విశాఖ కీర్తి పెంచేలా , అంతర్జాతీయ బ్రాండింగ్ తీసుకొనే వచ్చే విధంగా అనేక చర్యలు చేపట్టింది. శక్తివంతమైన ఈ నగరానికి మరిన్ని వసతులు, వనరులు కల్పించేలా అనేక అభివృధి కార్యక్రమాలు అమలు చేసేలా అనేక ప్రణాళికలు రచనలు చేసి అమలు పరుస్తోంది. అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా ఇప్పటికే G20 సదస్సు, గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్, అంతర్జాతీయ వైద్య సదస్సు, మారిటైమ్ సదస్సు ఇలా అనేక అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించడం ద్వారా విశాఖకు గ్లోబల్ బ్రాండింగ్ తీసుకొని వచ్చింది జగన్ ప్రభుత్వం తద్వారా మరిన్ని పెట్టుబడుల ఆకర్షణకు, ఉద్యోగ , ఉపాధి అవకాశాల కల్పనకు మార్గం సుగమం అయింది. ఇటీవల ప్రధానితో సమావేశం అయిన సీఎం జగన్ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు త్వరగా ఆమోదం తెలిపాలని కోరారు. అన్ని అనుకున్న విధంగా జరిగితే రానున్న 20 సంవత్సరాలలో విశాఖ అంతర్జాతీయ సిటీగా అవిర్భించబడుతోంది.