గత కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వేదికగా దివంగత మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మీడియా సమావేశం నిర్వహించి తండ్రి హత్యా పరిణామాలకన్నా, సీఎం జగన్ టార్గెట్ గా రాజకీయ ప్రసంగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తమ కుటుంభం రాబోయే రోజుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతునట్టు సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే . అయితే ఈ వాదనను మరింత బలపరుస్తూ తన తండ్రి 5వ వర్ధంతి రోజైన ఈ నెల 15న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తమ అనుకూల వ్యక్తులు, వైయస్ కుటుంభ వ్యతిరేకులతో ఆత్మీయ సమావేశం పేరిట భేటీ అవుతున్నట్టు. ఈ సందర్భంగా రాజకీయంగా వేసే ఆడుగులపై కీలక ప్రకటన చేయాలని భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి సునీత ఇద్దరు వైయస్సార్ కుటుంబంతో దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉన్న తెలుగుదేశంలో చేరి ఈసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు. పుష్కర కాలం కింద వైయసార్ మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీ అహంకారపు దోరణిని వ్యతిరేకించి సొంతగా పార్టీ పెట్టుకున్న జగన్ వైపే కుటుంబం అంతా నిలబడినా , సొంత తమ్ముడైన వైయస్ వివేకాని మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండేలా వత్తిడి చేసి వదిన గారైన వైయస్సార్ సతీమణి విజయమ్మ గారిపైనే పోటీకి దిగేలా వివేకా గారిని రాజకీయంగా తప్పటడుగు వేయించడంతో సునీత , నర్రెడ్డి రాజాలదే కీలక పాత్ర అని కడప వాసులకి విదితమే ..
అయితే నాడు రాజకీయంగా ఆ ప్రయత్నం విఫలం చెందడంతో స్తబ్దుగా ఉండిపోయిన వీరు తిరిగి వైయస్ వివేకా దారుణ హత్యనే నేడు తమ రాజకీయ మెట్టుగా ఉపయోగించుకునే ప్రయత్నం ప్రారంభించినట్టు తెలుస్తుంది.
నాడు జగన్ పై రాజకీయంగా గెలవలేకపోయినా నేడు వివేకా హత్యను అడ్డు పెట్టుకుని బాబు నుండి లబ్ది పొందాలని, జగన్ ని రాజకీయంగా అభాసు పాలు చేయాలనే ఉద్దేశంతోనే నర్రెడ్డి సునీత చంద్రబాబుతో చేతులు కలిపి ఈ ప్రయత్నానికి తెరలేపినట్టు తెలుస్తుంది. వివేకా హత్యలో కీలకంగా ఉన్న ఆస్తి డాక్యుమెంట్లు, రెండో భార్య షామీం తో సునీతకు ఉన్న ఆస్తి తగాదాల నేపధ్యం గురించి మాత్రం ఆమె ఎక్కడా వివరణ ఇవ్వకుండా, తండ్రి హత్యలో కీలకంగా ఉన్న దస్తగిరి అనే ఒక క్రిమినల్ నే వెనకేసుకుని వస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై నెపం నెట్టే ప్రయత్నం చంద్రబాబుకి తందానా అనే మీడియాని వాడూకుంటూ చేస్తూ వస్తున్నారు. వివేకా హత్య కేసులో నర్రెడ్డి కుటుంబం పై ప్రజల్లో అనుమానాలు ఉన్న నేపధ్యంలో నేడు వీరు చంద్రబాబుతో కలిసి సీఎం జగన్ కి వ్యతిరేకంగా కదుపుతున్న పావులను చూసి పులివెందుల ప్రజలు ఎలా స్పందిస్తారో రాబోయే ఎన్నికల్లో తేలిపోతుంది.