2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నాకున్న అనుభవం ఇంకెవరికీ లేదని, పున్వరిభిజన తర్వాత నవ్యాంధ్రను అభివృధి చేసే బాధ్యత తనదే నని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నెల్లూరు జిల్లాకు అమలు చేయలేని హామీలను ఎన్నో ఇచ్చి వాటిని తుంగలో తొక్కాడు. వాటిని ఓసారి పరిశీలిస్తే..
– వీసీఐసీ వాడ
– ఆటోమొబైల్ హబ్
– ఎయిర్పోర్టు
– దుగరాజపట్నం పోర్టు
– పర్యాటక కేంద్రం – పులికాట్ సరస్సు
– స్మార్ట్ సిటీ
– ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్
– మెరైన్ ఇనిస్టిట్యూట్
– ఎరువుల కర్మాగారం
వీసీఐసి – విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృధిలో భాగంగా నెల్లూర్ జిల్లాలో పోర్ట్ ఆధారిత పరిశ్రమలు వచ్చేలా ఒక ప్రత్యేకమైన సిటీ నీ ఏర్పాటు చేస్తా అని చెప్పుకొచ్చిన చంద్రబాబు , దానికి సంబంధించిన పనులకు శంకుస్థాపనలు కూడా చేయలేదు. అంతేకాకుండా ఆటోమొబైల్ హబ్, ఎయిర్పోర్ట్ లకు సంబంధించిన ఒక్క ఫైల్ కూడా ముందుకు జరపలేదు. దుగ్గరాజపట్నం పోర్ట్ వైపు అడుగులు పడలేదు. పోర్టుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తామని 2018 వరకూ చెప్తూనే ఉన్నా కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన లేదు. స్మార్ట్ సిటీ ఊసే లేదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ రాష్ట్రంలో ఒక్కటి కూడా తీసుకురాలేదు. మెరైన్ ఇన్స్టిట్యూట్, ఎరువుల కర్మాగారం ఇలా చెప్పిన వాటిలో ఒకటి కూడా పూర్తి చేయకుండా అధికారం అనుభవించిన చంద్రబాబు తన పాలన పూర్తి చేసుకున్నాడు.