మొన్నటి వరకూ, వైసీపీ నాయకులు మాట్లాడే భాష అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ.. గుండెలు బాదుకున్న తెలుగు తమ్ముళ్ళు ఇపుడు లోకేష్ కుర్చీ మడతపెడతా, తగ్గేదేలా, ఆ కొడుకూ ఈ కొడుకూ అంటూ ఉంటే ఆనందంతో చప్పట్లు కొడుతూ మైమరచిపోతున్నారు.
లోకేష్ కూడా ఫక్తు కమర్షియల్ సినిమాలో ఉండే జులాయి హీరోలా అన్‌పార్లమెంటరీ పదాలను సభలలో వాడుతూ, వాటినే తన ఉపన్యాస అస్త్రాలుగా ఫీలైపోతూ, తనకు తానే సెల్ఫ్ జాకీలెసుకుని పైకి లేపుకుంటున్నారే తప్ప, ఒక భావినాయకుడిగా తన ఇమేజి మసకబారుతుందన్న విషయాన్ని మరిచిపోతున్నారు.
ఏదైనా పార్టీలోని చోటా మోటా నాయకులు, మీడియం కేటగిరీ నేతలు కావాలని ప్రత్యర్థిపై ఎదురుదాడికి వాడే అసభ్య పదజాలం కూడా సిగ్గు పడేలా లోకేష్ తన సభలలో మాట్లాడుతూ, అసభ్య సంజ్ఞలు చేస్తూ తన కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నాను అనుకుంటున్నారే తప్ప, ఒక లీడర్‌గా తన స్థానాన్ని ప్రజలు ఎంత తక్కువగా చూస్తారు అనే విషయాన్ని గమనించడంలో బొక్కబోర్లా పడుతున్నారు.
ఇలా లేకిగా, విచక్షణ, వివరణ, మెచ్యూరిటీ లేకుండా మాట్లాడే నాయకుడు భవిష్యత్తులో తమని ఏం పాలిస్తాడు ఏం పట్టించుకుంటాడు అని ప్రజలకి కనుక ఒక్కసారి అనిపిస్తే… లోకేష్‌కు మళ్ళీ మంగళగిరి ఫలితం కనపడినా ఆశ్చర్యపోనక్కర లేదు. మరొక పక్క రాజశ్యామల యాగం చేస్తూ చంద్రబాబు మంత్రాలు చదువుతూ ఉంటే… మరొక పక్క లోకేష్ ఇలా బూతులు చదువుతూ… ఆ యాగం తాలూకా ఫలితం రావడానికన్నా ముందే…. తండ్రికి తీవ్ర నష్టం కలిగించే పనులు చేస్తున్నారు.