అధికార పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరొకసారి అవకాశం ఇవ్వలేదని బయటకి వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యి కూటమి తరుపున అసెంబ్లీ సీటు సంపాదించిన టీడీపీ పార్టీలో ఏ ఒక్క కార్యకర్త, నాయకుడు సపోర్ట్ చెయ్యకపోవడంతో ఇప్పుడు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒంటరి వాడిగా మిగిలారు. అధికార వైసీపీ పార్టీ ఎంపీగా అవకాశం ఇచ్చినా, కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేగా సత్యవేడు మాత్రమే కావాలని వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు కోనేటి అదిమూలం. టికెట్ అయితే సంపాదించారు గాని లోకల్ టీడీపీ నాయకులు సహకారం అందించడం లేదు. పైగా తిరిగి టీడీపీ ఇద్దరు నాయకులు రెబల్ గా పోటికి సిద్ధం అయ్యారు.
మొన్నటి వరకు టీడీపీ సత్యవేడు ఇంచార్జ్ గా హెలెన్ కి చంద్రబాబు నాయుడు టికెట్ నిరాకరించడంతో సత్యవేడు టీడీపీలో ముసలం మొదలయింది. గతంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అవినీతిపరుడు, ఇసుక దొంగ అని తీవ్ర విమర్శలు చేసి ఈరోజు పార్టీ లోకి ఎలా తీసుకుంటారని హెలెన్ గొడవ మొదలు పెట్టారు. దీనికి నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మద్ధతు తెలిపి మేము ఆదిమూలంకు సహకరించే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ హెలెన్ సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత కూతురు.
మరో వైపు సత్యవేడు నుండి టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన రాజశేఖర్ కూడా తనకే టికెట్ వచ్చిద్దని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పాదయాత్రకు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. తీరా చూస్తే వైసీపీ నుండి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీలోకి తీసుకొని టికెట్ ఇవ్వడంతో తాను కూడా సహరించేది లేదని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. అంతే కాకుండా టీడీపీ ముఖ్య నాయకులు అంతా తిరుపతిలో మీటింగ్ పెట్టుకుని ఆదిమూలంకు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చెయ్యకూడదని తీర్మానించుకున్నారు.
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కోనేటి ఆదిమూలం నియోజకవర్గంలో తనకు తోడుగా నిలబడే నాయకుడు లేక ఒంటరి వాడు అయ్యారనే చర్చ జరుగుతోంది. ఇది ఇలానే కొనసాగితే మాత్రం ఆదిమూలం ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.