ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతమ కంచుకోట అనుకునే నియోజకవర్గాల్లో బీటలు బారడం మొదలైంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి గత రెండు సార్లు టీడీపీ భారీ మెజార్టీ తో విజయం సాధించినా ప్రజలకు అందుబాటులో లేకుండా వున్నారు. ఇక 2019లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మార్గానీ భారత్ తన నిధులతో పాటు సిఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో పాటు రాజమండ్రీ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి నిధులు కేటాయించారు సీఎం వైఎస్ జగన్. ఎటు చూసినా అభివృద్ది కనపడుతూ ప్రజలకు కొత్త ఆశలు కల్పించారు.
గతంలో రాజమండ్రీ అభివృద్ధి అంటే గోదావరి పుష్కరాలకు మాత్రమే అభివృద్ది చేస్తారు అనే నానుడి వుండేది . అలాంటి నానుడిని బ్రేక్ చేస్తూ కరోనాతో రెండు సంవత్సరాలు నష్టపోయినా 558 కోట్లు వెచ్చించి సిటీ సుందరీకరణ, డ్రైనేజీ, త్రాగునీటి వ్యవస్థలను అభివృధి చేసారు. అంతే కాకుండా సిటీ పరిధిలో పచ్చదనం పెంచారు, కంబాల చెరువు పార్క్ అయితే రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ గా అభివృద్ది చేసారు. పుష్కర ఘాట్ వద్ద పుష్కర ప్లాజా, హ్యాపీ స్ట్రీట్, ఫుడ్ స్ట్రీట్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి అవి సిటీకి మరింత అందన్ని తెచ్చాయి. అర్ట్స్ కాలేజీ సమీపాన అర్బన్ ఫుడ్ ప్లాజా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అర్బన్ పార్కులు, మున్సిపల్ స్కూల్స్, ఆరోగ్య ఉప కేంద్రాలు నాడు నేడు కింద కోట్లతో అభివృధి చేసారు. అలాగే ప్రభుత్వా మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం అయ్యి ఓక సంవత్సరం పూర్తి కూడా చేసుకుంది.
ఇలా సిటీ అంతా వైసీపీ ప్రభుత్వంలో వందల కోట్లతో అభివృద్ధి జరిగితే 2014 నుండి 24 వరకు టీడీపీ ఎమ్మేల్యే గా వున్న ఆదిరెడ్డి భవాని నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. అలాగే కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు అని పూర్తీ స్థాయిలో వ్యతిరేకత వున్నది. నేను చేసిన మంచిని చూసి నాకు ఓటు వెయ్యండి అని మార్గాని భరత్ అడుగుతుండే సరికి టీడీపీ కంచుకోటకు వేగంగా బీటలు వారి కుప్ప కూలడానికి సిద్ధంగా వున్నదని ఇక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారు.