బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్యాకేజీ ఎక్కడ ఉంటే ప్రశాంత్ కిషోర్అక్కడ ఉంటాడని వెల్లడించడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెంగాల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ కు పనిచేయడం లేదని, ఐ ప్యాక్ చెందిన ప్రతీక్ జైన్ పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారని, గతంలో రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని తెలిపిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశంకి పని చేస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఏ తెలుగుదేశం కూటమికి అనుకూలంగానే ఆయన మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు.
కాగా ప్రశాంత్ కిషోర్ 2021 బెంగాల్ ఎన్నికల తర్వాత ఇంకా ఎన్నికల వ్యూహకర్తగా పని చేయను అంటూ ఐ ప్యాక్ నుంచి తప్పుకున్నాడు. బీహార్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో రాజకీయ అరంగేట్రం చేసి కొన్ని రోజులు చురుగ్గా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత నితీష్ కుమార్ తో పొంతన పడక సొంత పార్టీని స్థాపించాడు. సొంత పార్టీని స్థాపించిన తర్వాత బీహార్ మొత్తం పాదయాత్ర చేసి ఎన్నికల్లో పోటీ చేశాడు.
బీహార్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపకపోయేసరికి కొత్త దారిని ఎంచుకున్నాడు. గతంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేసిన పార్టీలు గెలవడంతో, అప్పటి గెలుపులను ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ దగ్గర ఎటువంటి టీం లేకపోయినా ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో మీడియా సమావేశాలు నిర్వహించి తనకు ప్యాకేజీ ఇచ్చిన పార్టీలు గెలుస్తాయంటూ జోస్యం చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పగా అక్కడ కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్ రాజస్థాన్ చత్తీస్గడ్లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పగా ఆ మూడు రాష్ట్రాలలో బిజెపి గెలిచింది. ఇలా తనకు అనుకూలంగా ఎవరు ప్యాకేజిస్తే గెలుస్తారు అంటూ మీడియా ముందు ప్రెస్ మీట్ లు పెట్టడం, ఆ ఎన్నికల్లో ఆయన చెప్పిన పార్టీలు ఓడిపోవడం పరిపాటిగా మారిందంటూ మమత బెనర్జీ ఎద్దేవా చేశారు.