పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతూ 25 కేజీల బియ్యం కోసం కాదు 25 సంవత్సరాల భవిష్యత్ కోసం పార్టీ పెడుతున్న అని ప్రకటించి యువతను ముఖ్యంగా కాపు ల్లోని యువతను ఆకట్టుకున్నారు. వారు రాజకీయాల్లో మార్పు కోసం అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను నమ్మి పవన్ కళ్యాణ్ వెంట నడిచి తమ విలువైన వయస్సును , డబ్బును ఖర్చు పెట్టారు.ఇప్పుడు చూస్తే వైసీపీ, టీడీపీ నుండి నాయకులను తెచ్చి జన సేన టికెట్ లు ఇచ్చారు, తిరిగి అనకాపల్లి ఎంపీ జన సేన సీటు సీఎం రమేష్ అడిగారు అని బిజెపికి ఇచ్చాను అని నిన్న అనకాపల్లి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూసి ఇంకా మనకు జన సేన పార్టీ దేనికి అయితే టీడీపీ లో బిజెపి లోనో విలీనం అయితే మనకు బాగుంటుంది కదా, ఇలా మా విలువైన జీవితంతో పాటు ఆర్థికంగా నష్టపోయి ఉండేవాళ్ళం కాదు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన రోజు పార్టీల జంపింగ్ జపంగ్ లు వద్దు కొత్త నీరు కావాలి అంటూ రెచ్చగొట్టారు అది నిజమని నమ్మి మాలాంటి జన సైనికులు పార్టీకి కష్ట పడుతూ, జన సేన జెండాను ఊరు ఊరుకి తీసుకెళ్ళాము. 2014 లో పోటి చెయ్యకుండా మనకు అనుభవం లేదు కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబుకు, కేంద్రంలో మోడీ కి సపోర్ట్ చేస్తున్న అని ప్రకటించారు, సరేలే మొదటి సారిగా పార్టీ పెట్టాడు ఎలక్షన్స్ కి టైం లేదు అని సర్దిచెప్పుకొని టీడీపీ, బిజెపి కూటమి కి సపోర్ట్ చేశారు జన సైనికులు. అదే టైంలో టీడీపీ,బిజెపి హామీలకు నాది భాధ్యత అని హామీ ఇచ్చారు. తీరా ఎలక్షన్స్ అయినాక టీడీపీ, బిజెపి మోసం చేసింది అని చెబితే అది నమ్మి తిరిగి 2019 లో పోటీ చేసిన జన సేన జెండా ను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి చాలా కష్టాలు పడ్డాము, అ తరువాత పార్టీతో పాటు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన జన సైనికులు పవన్ కళ్యాణ్ వెంట నడిచి అండగా నిలిచారు.
ఇప్పుడు తాజాగా చూస్తే 2024 లో మళ్ళీ మోసం చేసిన టీడీపీ, బిజెపి తో పొత్తు పెట్టుకుని తిరిగి చాలా తక్కువ సంఖ్యలో టిక్కెట్లు పొంది వారిలో 70% టీడీపీ, వైసీపీ నుండి వచ్చిన వారికి టికెట్లు ఇస్తే ఇంకా జన సేన పార్టీ ఎందుకు, జన సైనికుల కష్టానికి విలువ ఏముంది అని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కు దూరంగా జరుగుతున్నారు. 2014 నుండి 2024 వరకు జరిగిన ప్రతీ విషయం చూస్తే పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడి కోసం మాత్రమే పని చేస్తున్నారు , చంద్రబాబు నాయుడి రాజకీయ లబ్ధికోసమే మా జన సైనికులను వాడుకుంటున్నాడు అంటూ ఒకరి తరువాత ఒకరుగా పవన్ కళ్యాణ్ తీరుకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి అసలు ఈ జన సేన పార్టీ ఎందుకు ఏ టీడీపీ లోనో బిజెపి లోనో విలీనం చేస్తే సరిపోతుంది అంటూ జన సేన పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు.
కానీ ఇవన్నీ పట్టించుకునే స్థితిలో జన సేన అధినేత పవన్ కళ్యాణ్ లేరు అదే ఇక్కడ గమనించదగ్గ విషయం.