శ్రీకాకుళం జిల్లాలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా పెద్దన్నగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏకచత్రాధిపత్యం చెయ్యడానికి తమకు అడ్డుగా వున్న వారిని తమ కుటిల రాజకీయంతో అడ్డు తొలగించుకొని తమకు అనుకూలంగా తమ మాట వినే వారికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చక్రం తిప్పారు. ముఖ్యంగా తమకు ఎప్పటి నుండో జిల్లాలో అడ్డుగా వున్న మరో రాష్ట్ర నాయకుడు మాజీ టీడీపీ అధ్యక్షుడయిన కళా వెంకట్రావును ఎచ్చెర్ల నుండి బీజేపీలోని పురంధేశ్వరి అండతో అడ్డు తొలగించుకొని విజయనగరం జిల్లాకు అందులో చీపురుపల్లి నియోజకవర్గంకు పంపించారు. ఇప్పుడు ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీకి, కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడే కరువయ్యాడు.
అంతటితో ఆగకుండా జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వలన తమ పెత్తనం సాగడం లేదని మాజీ సర్పంచ్ అయిన గోండు శంకర్ కు శ్రీకాకుళం టికెట్ ఇప్పించారు. దీనికి ప్రతి ఫలంగా కింజరపు కుటుంబానికి గట్టిగా డబ్బులు అందాయని శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. ఈ దెబ్బతో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబం తమ రాజకీయ జీవితానికి ముగింపు పలికి అందుకు కారణమైన కింజరపు రామ్మోహన్ నాయుడు, అచ్చెం నాయుడు మీద ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించి శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోండు శంకర్ కు తమ సహకారం అందించడం లేదు.
మరో నియోజకవర్గం పాతపట్నంలో మరో సీనియర్ రాజకీయ కుటుబమయిన కలమట వెంకటరమణ ఆధిపత్యాన్ని తగ్గించడానికి మామిడి గోవిందరావుకు టికెట్ ఇప్పించడంలో బాబాయి అబ్బాయిలు తమ పలుకుబడిని ఉపయోగించారు. ఇక్కడ టీడీపీ టికెట్ కోసం బాబాయి అబ్బాయిలకు కోట్లు సమర్పించుకున్నారు అందుకే మామిడి గోవిందరావుకు టికెట్ వచ్చిందని కలమట వెంకటరమణ బాబాయి అబ్బాయిల మీద ప్రత్యక్ష యుద్ధమే ప్రకటించారు. దాంతో టీడీపీకి ఇక్కడ గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి.
మరో సీనియర్ నేత ప్రతిభా భారతి కి చేక్ పెడుతూ తన కుటుంబానికి రాజాంలో టికెట్ రాకుండా కింజరాపు ఫ్యామిలీ అడ్డుకుంది. ఇలా జిల్లా అంతటా తమకు అనుకూలంగా ఎవరు అడ్డులేకుండా చేసుకుంటున్నారు కానీ టీడీపీ పార్టీ భవిష్యత్తును గెలువు అవకాశాలను క్లిష్టం చేస్తున్నారునే విషయం మర్చిపోయారు . ఇప్పుడు కింజరపు ఫ్యామిలీ బాబాయి అబ్బాయి దెబ్బకు సగం నియోజకవర్గాల్లో టీడీపీ గ్రూపులుగా విడిపోయి కార్యకర్తలు ఎవరికి సపోర్ట్ చెయ్యాలో తెలియక విలవిలలాడుతున్నరు.