టీడీపీ తో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించగా, ఒకేసారి 94 మంది అభ్యర్థులను బాబు ప్రకటించినా, కేవలం 5 మంది అభ్యర్దులనే చిత్తు కాగితంపై రాసి చూపిన పవన్ కళ్యాణ్, రెండు మూడు రోజుల్లోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తానని ప్రకటించాడు..
పది రోజులు గడుస్తున్నా ఆ మిగిలిన 19 మంది అభ్యర్థుల జాడ లేదు. ముందు ప్రకటించిన 5 స్థానాల్లో కూడా తన పేరు లేదు. తను ఎక్కడి నుండి పోటీ చేస్తాడో చెప్పలేదు, అసలు పోటీ చేస్తాడో లేదో కూడా తెలీదు.. ఇక మిగిలిన 19 స్థానాల్లో ఎక్కడ నుండి పోటీ, అభ్యర్థులు ఎవరు అనే విషయం పై సూక్ష్మస్థాయిలో కూడా సమాచారం లేదు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కనీసం 24 సీట్లలో కూడా పార్టీ పెట్టి 10 ఏళ్లు అవుతున్నా అభ్యర్దులు దొరకని పరిస్థితి నెలకొని ఉంది అంటే పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ ని, తన రాజకీయ జీవితాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు..
ఇప్పటికే అనకాపల్లి ఎంపీ సీటు, గాజువాక, రాజమండ్రి రూరల్ సీట్లను త్యాగం చేసి త్యాగాల త్యాగరాజు అనే టైటిల్ ని సార్ధకం చేసుకున్న పవన్, మిగిలిన 19 సీట్లలో కూడా టీడీపీ నుండి సీటు రాని అభ్యర్థుల కోసమే రిజర్వ్ చేసి జనసేన ని పూర్తిగా పసుపుమయం చేసే భాద్యత తీసుకున్నట్లుగా ఉంది.
ఈ మాత్రం దానికి పవన్ కు ప్రత్యేకంగా పార్టీ దేనికి, టీడీపీలోనే జాయిన్ అయ్యి ఆ పార్టీ లోనే ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే పోయేదానికి అని సగటు జనసేన కార్యకర్త ఆవేదన…