‘పవన్ జాతకంలో ఏదైనా దోషం ఉండొచ్చు.. అందుకే చాలా ఏళ్ల నుంచి ఏమీ అనుకున్నా చేయలేకపోతున్నాడు. సీఎం కావాల్సినోడు.. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో ఎదుగుదల లేదు. మరోవైపు సినిమాలకు కలెక్షన్లు నిల్. చివరికి ఎటూ కాకుండా పోతాడేమో..’ ఒకప్పటి ప్రజారాజ్యం కార్యకర్తలు, కొందరు జనసైనికుల్లో నెలకొన్న ఆందోళన ఇది.
సేనానికి మైకు దొరికితే చాలు. నోటికొచ్చింది చెప్పేస్తాడు. దీంతో జీవితంపై ఏ మాత్రం స్పష్టత లేని వ్యక్తి అని తేలుపోతుంది. రెండు లక్షలకు పైగా పుస్తకాలు చదివానంటాడు. ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని ఉండేది. నా స్థాయికి చదువు చెప్పే టీచర్లు లేకుండాపోయారు. ప్రపంచంలో ఉన్న డిగ్రీలన్నీ చదవాలని ఉండేదంటూ ఏదేదో చెప్పాడు. లాయర్లతో మీటింగ్ సమయంలో ఆరోజుల్లో నల్లకోటు వేసుకోవాలని ఉండేదని వ్యాఖ్యానించాడు. ఖాకీ వేసుకోవాలని అనిపించిందన్నాడు. చిత్తశుద్ధి, పట్టుదల ఉంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి ఉండేవాడు. కానీ చివరికి ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేకపోయాడు. అది కూడా ఒక్కోసారి ఒక్కో కోర్సు పేరు చెబుతాడు.
ఓసారైతే తుపాకీ పట్టుకుని అడవుల్లోకి వెళ్లిపోవాలనుకున్నానని బాంబ్ పేల్చాడు. ఎందుకీ బతుకని ఆత్మహత్య చేసుకుందామని భావించానని పలుమార్లు అన్నాడు. చిరంజీవి తమ్ముడిగా, సినిమా హీరోగా జీవితాన్ని ఎంజాయ్ చేసి జనంలోకి వచ్చేసరికి ఇలా సొల్లు కబుర్లు చెప్పాడు. నేను హిందూ మతంలో పుట్టాను. ఈ మంతమంటే చాలా గౌరవమని బీజేపీ పెద్దల వద్ద మార్కులు కొట్టేసేందుకు చెబుతుంటాడు. కానీ పెళ్లిళ్ల విషయంలో విరుద్ధంగా ప్రవర్తించాడు. ఒక్క పెళ్లి చాలనుకున్నా. కానీ అలా చేసుకుంటూ పోయానన్నాడు. కావాలంటే మీరు చేసుకోండన్నాడు. నిబద్ధత అనేది ఉండుంటే శ్రీరామ చంద్రుడిగా పేరు వచ్చిది కదా.. సినీ గ్లామర్ ఉంది. యువతలో క్రేజ్ ఉందని రెండుచోట్ల పోటీ చేసి గెలుద్దామనుకున్నాడు. కానీ విశ్వసనీయత లేక ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు. పైకి నాకు పదవులు వద్దని పవన్ చెప్పినా లోపల మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ ఉంది. కానీ రాజకీయాల్లో రాణించే ఆత్మవిశ్వాసం లేక నమ్మిన వారిని తెలుగుదేశానికి అమ్ముకుంటున్నాడు.
జీవితంలో అనుకుంది సాధించకలేకపోయిన పవన్‌కు తెలిసింది ఒక్కటే.. జగన్‌పై పడి ఏడవడం. 2019లో ఆయన సీఎం కాడు. కానీవ్వను. ఇది నా శాసనం. అడ్డుకుంటానన్నాడు. కానీ ఏమైంది. కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. 2024 ఎన్నికల నేపథ్యంలో జగన్‌ను అధఃపాతాళానికి తొక్కేస్తాను అంటున్నాడు. కానీ ఏమీ చేయలేడు. చరిత్ర తీసుకుంటే అదే చెబుతోంది.
ఏ విషయంలో అయినా సద్గుణాలు ఉన్న వాడు మాత్రమే పైకి వస్తాడు. కానీ పవన్ కళ్యాణ్‌లో అవేమీ లేవని ఎప్పుడో స్పష్టమైంది. ధైర్యం, తెగింపునకు ఆమడ దూరంలో ఉంటాడు. నోరేసుకుని అరిచి వెర్రి ఫ్యాన్‌ను ఖుషీ చేయడం తప్ప అనుకున్నది సాధించలేని వ్యక్తి. ఆయన చెప్పే మాటలు, చేష్టలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. 2009 నుంచి ఈయన గురించి కాపులకు బాగా తెలుసు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న సంఘటనలు చూసి.. ఒక్క సుగుణం కూడా లేని నువ్వు ఎప్పటికీ మాకు నాయకుడు కాలేవని, నిన్ను నమ్మి జీవితాలు బుగ్గిపాలు చేసుకోలేమని తేల్చి చెబుతున్నారు.
తెలుగు తమ్ముళ్లయితే పవన్ స్పీచ్‌లపై సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడుతూనే ఉంటారు. ఆయన నిలకడ లేని వ్యక్తి అని, జాతక రీత్యా ఏమీ సాధించడలేని, టీడీపీకి బానిసగా ఉంటూనే శేష జీవితం గడిపేస్తాడని, అదే రాసి పెట్టుందని చెబుతుంటారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే అది నిజమేనని అనిపించక మానదు.