నిన్న టీడీపీ జనసేన కలిసి అభ్యర్థుల పేర్లు ప్రకటించిన దగ్గర నుంచీ జనసేనికులు, జనసేన నేతలు రగిలిపోతున్నారు. మరీ ముఖ్యంగా కాపు జన సేన నేతలైతే… పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులకు తల దేనికి కొట్టుకోవాలో తెలియనంతగా ఉన్నారు.
పార్టీ పట్టి పదేళ్ళు అవుతున్నా, కాపు సామాజిక వర్గం వంటి బలమైన వర్గం అండదండగా ఉన్నా, పెడుతున్న సభలకు వేలాది గా అభిమానులు వస్తున్నా కూడా మొత్తం స్థానాల్లో కనీసం నలభై శాతం చోట్ల కూడా తన అభ్యర్ధులను నిలబెట్టలేనంత లేదా పొత్తులో వాటా తెచ్చుకోలేనంత చేవ చచ్చిన పార్టీగా జనసేన పార్టీని పవన్ ఎందుకు తయారు చేస్తున్నాడూ అంటూ కాపు నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
పోనీ రాష్ట్రం అంతా టీడీపీకి వదిలేసినా, జనసేనకి అంతో ఇంతో బలం ఉన్న గోదావరి జిల్లాల్లో, కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నియోజక వర్గాల్లో కూడా జనసేన టికెట్లు పొందకుండా టీడీపీకి త్యాగం చేసేంత బానిస మనస్తత్వంతో, తన వెనుక వస్తున్న కాపుల ఆత్మగౌరవాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ తాకట్టు పెడుతున్నాడు అని గోదావరి జిల్లాల్లోని కాపు నేతలు, ఓటర్లు భావిస్తున్నారు.
హరిరామజోగయ్య వంటి సీనియర్లు, బాబు బుధ్ధి ఎరిగిన వారు మొదటి నుంచీ పవన్ ను హెచ్చరిస్తూ ఉన్నా, వినకుండా పెడచెవిని పెటైటి పైపెచ్చు పొత్తు ధర్మం పాటించమంటూ తన అభిమానులకు బానిస మనస్తత్వాన్ని పులుమిన పవన్ నిజంగానే ప్యాకేజీ తీసుకుని ఇలా ప్రవర్తిస్తున్నారా అని ఆలోచిస్తున్నారు.
నిన్న తొలి విడత బాబు ప్రకటించిన 118 సీట్లలో
గోదావరి జిల్లాల్లో టీడీపీ కి- 13 సీట్లు, జనసేనకు-2 సీట్లు ఉన్నాయి. అంటే ఇంకా అక్కడ 19 స్థానాలు ఉన్నాయి. అందులో జనసేనకు మరొక 5 , 6 కు మించి బాబు ఇవ్వడు. అంటే కాపుల అడ్డా గోదావరి జిల్లాలో 10 స్థానాల లోపే జనసేన పోటీ చేయనుంది.
ఎక్కువ సీట్లలో టీడీపీ పోటీ చేసి కాపుల వలన భారీగా లబ్ది పొందాలనేది బాబు ప్లాన్ అని కాపులంతా భావించి జనసేనకు చేసిన ఊడిగం ఇంకా చాలు అనే భావనకు వచ్చేస్తున్నారు.