చంద్రబాబు తాను మాట్లాడితే ఆయన నోటి నుండి వచ్చే ఊతపదం నాకు అధికారం ఇస్తే నేను సంపద సృష్టిస్తానని, అయితే ఆయన 14ఏళ్ళు ముఖ్యమంత్రి సీట్ లో ఉండగా ఎప్పుడు రెవెన్యూ లోటులోనే రాష్ట్రం ఉండటం, అభివృద్ది సూచికల్లో రాష్ట్రం ఎప్పుడు తిరోగమనం పట్టడం పరిపాటిగా జరుగుతూనే వస్తుంది. ఈ వాస్తవాలని చంద్రబాబు తన మీడియా మేనేజ్మెంట్ సాయంతో ప్రజలకి తెలియనియకుండా జాగ్రత్త పడుతూ తానో విజనరీనని తాను అధికారంలో ఉంటేనే అభివృద్ది జరుగుతుందని బూటకపు మాటలు చెబుతూ వస్తుంటారు చంద్రబాబు.
అయితే చంద్రబాబు చెప్పే బూటకపు మాటలని నమ్మే రోజులు పోయాయని, ఎవరి పాలనలో ఎంత అభివృద్ది జరిగిందో లెక్కలతో సహా ప్రతీ సమాన్యుడు చూసుకునే అవకాశం ఇంటర్నెట్ ద్వారా వచ్చిందని కుండ బద్దలు కొట్టారు కేశినేని నాని. ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో ఎప్పుడు అప్పులు ఎఫ్ఫార్బీఎం లిమిట్ దాటలేదని చంద్రబాబు పాలనలో మాత్రం ఆ లిమిట్ దాటి అప్పులు చేశారని ఈ లెక్కన ఎవరు ఆర్ధిక క్రమశిక్షణ పాటించినట్టు అని సూటిగా ప్రశ్నించారు. అలాగే జగన్ చంద్రబాబు కన్నా ఎక్కువ సంపద సృష్టించినట్టు ఆర్బీఐ లెక్కల ద్వారా నిరూపితం అయిందని చెప్పుకొచ్చారు .
జగన్ తన పాలనలో చంద్రబాబు కన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని, చంద్రబాబు కన్నా ఎక్కువ తలసరి ఆదాయం పెంచారని, జీఎస్డీపీని పెంచారని, పేదరికాన్ని చంద్రబాబు పాలన కన్నా తగ్గించారని ఇవన్నీ ఆర్బీఐ , నీతి ఆయోగ్ చెప్పిన లెక్కలేనని, కావాలంటే ప్రతి ఒక్కరూ ఈ లెక్కలని చెక్ చేసుకునే వేసులుబాటు ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఒక ఔట్ డేటెడ్ పోలిటీషియన్ అని ప్రజలకి ఆయనకి మధ్య ఆలోచనా విధానంలో చాలా గ్యాప్ పేరిగిపోయిందని చంద్రబాబు ఆలోచనా విధానం ఎప్పుడు ధనికులని మరింత ధనికులని చేసే విధంగా ఉంటుండి తప్ప పేద, మధ్య తరగతి అవసరాలని పట్టించుకునే విధంగా ఉండదని అందుకే ఇప్పుడు ఆయనని ప్రజలు కోరుకోవడంలేదని తేల్చేశారు.