నిజంగానే, అధికారం కోసం కాపు సామాజిక వర్గాన్ని కూడగడుతున్నాడా? మరోసారి అధికారంలోకి రావాలని ఆశ పడుతున్న చంద్రబాబుకి సాయపడుతున్నాడా?
పెద్ద సంఖ్యలో ఉన్న కాపుల్ని మళ్ళీ కమ్మవారు అధికారంలోకి రావడానికి మెట్లుగా వాళ్ల కాళ్ళ ముందు పరుస్తున్నాడా? అని కొందరు కాపు నాయకులు నిలదీస్తున్నారు.
పవన్ కొంత ప్రజాకర్షణ ఉన్న నాయకుడు అన్నది కాదనలేము . గత ఎన్నికల్లో వచ్చిన 5.67 శాతం ఓట్లే అందుకు నిదర్శనం . పవన్ అండ గనుక లేకపోతే, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో లాగా అవమానకరమైన ఓటమి పొంది చీలికలు, పేలికలు అయిపోయే అవకాశం ఉంది.
తాను ప్రజల మనిషినని ఈనాటి ‘చేగువేరా’ అని చెప్పుకొంటూ తిరిగే పవన్, గతంలో ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలు విస్మరించి బడుగు బలహీన వర్గాలకు ఘోరమైన అన్యాయం చేస్తూ, వేలకోట్లు కూడబెట్టిన చంద్రబాబు నాయుడు పంచన మళ్ళీ చేరడం, మద్దతు ఇవ్వడం ద్రోహం కాదా అని కాపు యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు.
ప్రజలకు దూరమై కోట్లకు పడగలెత్తిన పెట్టుబడిదారుల ఏజెంట్ గా పని చేస్తున్న చంద్రబాబు పార్టీని గెలిపించాలనుకోవడం ఎవరిని ఉద్ధరించడానికి? ఏ పేద జనం మేలు కోసం? అటు ముస్లింలు, క్రైస్తవులు, మాల-మాదిగలు, ఉద్యోగ అవకాశాలు లేని బీసీలు, కాపులు అత్యధిక సంఖ్యలో ఉండగా, ఐదు శాతం కూడా లేని ఆధిపత్యం కులం అయిన కమ్మ వాళ్ల కోసం పనిచేయడం ఏ స్వార్ధ ప్రయోజనం కోసం? సామాన్య జనం అసలు పట్టని బిజెపితోను పవన్ సన్నిహితంగా ఉండడం దేనికి సంకేతం?.
అతి తక్కువ అసెంబ్లీ, పార్లమెంటు సీట్లకు చంద్రబాబు నాయకుడికి లొంగిపోవడం వెనక ఆంతర్యం ఏమిటి? “మా సీఎం పవన్ కళ్యాణ్” అని ఉద్రేకంతో అంటున్న కాపు యువతకి పవర్ స్టార్ సమాధానం ఏమిటి? చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడమే తన ఎజెండా అయితే, చాలామంది అంటున్నట్టు – పవన్ ఎంతకు అమ్ముడుపోయినట్టు? ఈ డబ్బు రాజకీయాల ముసుగులో కాపులు మరోసారి మోసపోతున్నారా?, కొందరు అమాయక కాపు యువతకు ఆరాధ్య నటుడు పవన్ కళ్యాణే ఈ దుర్గతికి కారకుడా?