ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించడానికి బీసీసీఐ చూస్తోంది అని ఏసీఏ కార్యదర్శి ఎస్ ఆర్ గోపీనాథ్ రెడ్డి విజయవాడలో ఒక హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి ఉమెన్స్ ఐపీఎల్ రెండో సీజన్ దృష్ట్యా ఇప్పటికే వేదికలు ఖరారు కావడంతో ఇప్పుడు నిర్వహించడానికి అవకాశం లేదు అని తెలిపారు. మహిళలకి సంభందించి ఇప్పటికీ వరకు ఏ రాష్ట్రం ప్రయోగం చేయని రాష్ట్ర స్థాయి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మనమే నిర్వహించినట్లు తెలిపారు తద్వారా ఇక్కడ బాగా ఆడిన నలుగురు ప్లేయర్స్ కు దేశ స్థాయిలో జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి సెలెక్ట్ అయినట్లు వివరించారు.
మన రాష్ట్రం నుంచి అనూష అనే క్రీడాకారిణి ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తుండంతో మన ఏసీఏ కి ఎంతో గర్వకారణం అన్నారు .పురుషుల నుంచి ఇప్పటికే హనుమ విహారి, శ్రీకర్, రికు భూయ్ ఇండియాకు ఆడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏసీఏ ఎన లేని కృషి చేయడం వల్లే ఈ ఫలితాలు అన్నారాయన. ఇప్పటికే విశాఖపట్టణం లో అంతర్జాతీయ స్టేడియం ఉన్నప్పటికీ బీసీసీఐ కొత్త స్టేడియం కి ప్రతిపాదనలు పంపి , కొత్త స్టేడియం నిర్మాణ ఏర్పాట్లుకు త్వరా తగిన పనులు జరుగుతున్నట్లు తెలిపారు