ఆంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా శ్రీ జగన్ మోహన్ రెడ్డి అయ్యిన తర్వాత అభివృద్ధిలో భాగంగా రెండు అంశాలు మీద ఎక్కువ దృష్టి సారించారు.అందులో మొదటిది పోర్టులు నిర్మించడం, రెండోది గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయడం. ఉన్న వనరులు ఉపయోగించుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేయడం , అలా ఉన్న రెండు వనరులను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపయోగించుకొంటుంది. 974 కిలోమీటర్ల గల సాగర తీరం మనకు వరం, అల ఉన్న వనరను ఉపయోగించుకొని ప్రతి 50 కిలోమీటర్లు ఒక పోర్ట్, లేదా ఒక ఫిషింగ్ హార్బర్ లేదా ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా దాదాపు 20 వేల కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది.
ప్రభుత్వం అదే విధంగా గ్రీన్ ఎనర్జీనీ డెవలప్ చేయాలని భావించి ఆ రకంగా పెట్టుబడుల ఆకర్షించింది, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులలో దాదాపు 5 లక్షల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో వచ్చినవే, గ్రీన్ ఎనర్జీ లో భాగంగా వచ్చేవి పవన విద్యుత్, సోలార్ విద్యుత్, బయోగ్యాస్ వంటివి. ప్రస్తుతం బయోగ్యాస్ విభాగంలో రిలయన్స్ రూ.1920 కోట్లు పెట్టుబడి పెట్టనుంది దీని ద్వారా 15 సీబీజీ యూనిట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో 8 యూనిట్ల ఏర్పాటు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పర్యవరణహిత ఇంధనం(గ్రీన్ ఎనర్జీ) ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ మక్కువ చూపుతుంది.
వరిగడ్డి, వేరుశెనగ పొట్టు, జొన్న కంకులు, ఖాళీ కొబ్బరి బోండాలు, చెరుకు పిప్పి, మున్సిపాలిటీ నుంచి రోజు వస్తున్న వ్యర్థాలు నుంచి కంప్రేస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి ప్రయోజనాలు కలగకపోయేసరికి రైతులు తమ పొంట పొలాల్లో ఈ చెత్తను కాల్చేస్తున్నరు. దీని ద్వారా కాలుష్యం, భూసారం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా జరగకుండా రైతులు నుంచి నేరుగా రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసి ఈ ప్రక్రియకు వాడనుంది. దీని ద్వారా 70 వేల మంది రైతులకు మేలు చేకూరనుంది. తద్వారా ప్రతి రైతుకు అదనంగా రూ. 6250 చొప్పున ఏటా రూ.45 కోట్ల మేరకు అదనపు ఆదాయం లభించనుంది. ఈ సీబీజీ యూనిట్ల అనుబంధంగా మరో రూ.1000 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచన వేశారు.
రానున్న కాలంలో సీబీజీలో అన్ని కంపెనీలు పెట్టుబడులు పెడతాయి అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఊపులో ఉన్న ఎల్ఎన్జీ (లిక్విడ్ నాచురల్ గ్యాస్) , సీఎన్జీ ( కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) లకు ప్రత్యమ్యంగా సీబీజీ వస్తుంది అని అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ రంగంలో రిలయన్స్, ఆదానీ వంటి సంస్థలు ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ 100 సీజీబీ యూనిట్లకు సంభందించి పెట్టుబడులు పెట్టనుంది. అందులో 15 యూనిట్ల ఆంధ్ర ప్రదేశ్ లోనే పెట్టనుంది. ఒకో యూనిట్ కు రూ.130 కోట్లు ఖర్చు కానుంది.మొదటి దశలో 8 యూనిట్ల ఏర్పాటు చేయనుంది.రెండో దశ అనగా 2026 నాటికి మరో 7 సీబీజీ యూనిట్ల ఏర్పాటు చేయనుంది.
తొలిదశలో భాగంగా కాకినాడ జిల్లాలో 3, తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరు వద్ద 2, విజయవాడ పరిటాల వద్ద 1, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1, కర్నూల్ జిల్లా లో 1 యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి 20 ఎకరాల స్థలం అవసరం కానుంది. మొదటి దశ యూనిట్లు 2025 సెప్టెంబర్ కు, రెండో దశ యూనిట్లు 2026 సెప్టెంబర్ కు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ఈ 15 యూనిట్లు ద్వారా ఏటా 7000 టన్నుల సీబీజీ,.34,300 టన్నుల సేంద్రియ ఎరువులు ఉత్పత్తి కానున్నాయి. ఈ 15 యూనిట్లు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3000 మందికి ఉపాధి అవకాశం లభించనుంది.