10 గిగా వాట్ లా సామర్థ్యం తో 2028 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం తో రామాయపట్నం వద్ద ప్రారంభించబడ్డ ఇండోసోల్ సోలార్ రికార్డ్ సమయం లో తన మొదటి దశను పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభించింది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి చెందినదే ఈ ఇండోసోల్ సోలార్..
ఈ ఏడాది జనవరిలోనే భూసేకరణ చేసిన ఇండోసోల్ కేవలం రెండు నెలలోనే ఉత్పత్తి ప్రారంభించడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ కు కావాల్సిన భూమిని మార్కేట్ రేట్ కే APIIC అందించింది.
500 మెగా వాట్స్ మాడ్యూల్స్, 500 మెగా వాట్స్ సెల్స్ మరియు 500 మెగావాట్స్ Ingot-Wafer తయారీ సామర్థ్యాలు కలిగి ఉండే ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ ని డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని, దీనివల్ల 800 మందికి ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుంది అని షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కి చెందిన శరత్ చంద్రా రెడ్డి తెలిపారు..
15 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 2025 నాటికి 5 గిగావాట్ లో కూడిన ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తి అవుతుంది అని, 2028 నాటికి పూర్తి ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుంది అని తద్వారా 32 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది అని సీఈఓ శరత్ చంద్రా రెడ్డి తెలిపారు..