ఏం చేసాడు చంద్రబాబు సీమకి?? చంద్రబాబు స్టేట్మెంట్ చూస్తే నిజంగానే ఏమైనా చేసేసాడు ఏమో, మనమే పొరబడుతున్నామేమో అనిపిస్తుంది కానీ, నిజానికి చంద్రబాబు రాయలసీమకి చేసింది ఏమైనా ఉందీ అంటే అది ద్రోహమే. దారుణమైన ద్రోహాన్ని రాయలసీమకి చేసాడు. సాధారణంగా అతను జగన్ని ఉద్దేశించి అనే “పులివెందుల రౌడీలు” అనే పదం కూడా రాయలసీమలోని ప్రాంతాన్ని ద్వేషించడమే, ఒక భౌగోళిక ప్రాంతానికి లేనిపోని ద్రోహం చేయడమే. హత్యా రాజకీయాలు, కక్షలు, ఫ్యాక్షనిజం వంటివి మాత్రమే సీమలో ఉన్నాయని పదే పదే గుచ్చి చెప్పే
బాబు ఏరకంగా మంచి చేసాడో ఆయనే ఆలోచించుకోవాలి.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచితే సీమకి నీళ్ళొస్తాయి, కరువు తగ్గించొచ్చు. దానికై వైయస్ 2007-08 లోనే ఒక నిర్ణయం తీసుకుంటే.. దేవినేని ఉమ, కోడెల శివప్రసాద్ తదితరులను ఉసిగొల్పి ప్రకాశం బ్యారేజి వద్ద దర్శనాలను చేయించింది ఈ నయవంచక బాబే. బాబుకు రాష్ట్రం కాదు, కులమే ముఖ్యం.
అప్పటి ఉపముఖ్యమంత్రి కె.కృష్ణమూర్తి కర్నూలుకు ఏదైనా చేసి న్యాయం చేయమని అడగ్గా… మూడే సీట్లు ఇచ్చిన కర్నూలును నేనెందుకు పట్టించుకోవాలి అని అడిగిన ఘనుడు చంద్రబాబు. ఇదే విషయాన్ని కృష్ణమూర్తి రెండు సార్లు మీడియా ముందు చెప్పి వాపోయారు కూడా. బాబుకి తనకి సీట్లు ఇచ్చిన ప్రాంతాలే ముఖ్యం.
భూములన్నీ సొంతకులపోళ్ళ చేతులకి చిక్కాక, అమరావతిలో మాత్రమే పెట్టుబడులు పెట్టించి సొంత కులస్తులు ఎదిగేలా చూసుకుంది బాబే. చెన్నైకి వరదలు వస్తున్న నేపధ్యంలో, తిరుపతిలో పది వేల ఉద్యోగాలు కల్పించే హెచ్.సీ.ఎల్.ను ఏర్పాటు చేస్తామని ఆ కంపెనీ ఛైర్మన్ శివనాడార్ తిరుమలకి వచ్చిన సందర్భంగా మాట ఇస్తే… ఆయన్ని అమరావతిలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి తిరుపతి నుంచి ఆ కంపెనీ ఎగిరిపోయేలా చేసింది ఈ మేక వన్నె బాబే. కేంద్రం ఇచ్చిన ప్రతిష్టాత్మక ఎయిమ్స్ హాస్పిటల్ ను కూడా సొంతం కులస్తులు ఎక్కువగా ఉండే గుంటూర్ కు తోలుకుపోయింది కూడా ఈ కులపిచ్చి బాబే.
రాయలసీమలో ఉన్న శ్రీ సిటీ అనేది ఇప్పుడు ఏపీలో పరిశ్రమల కేంద్రంగా ఉంది. దానిని ముందుచూపుతో అక్కడ పెట్టించింది కాస్తయినా అభివృద్ధి జరిగేలా చేసింది వై.యస్. ఇపుడు అదే పంధాలో జగన్ కడప జిల్లా కొప్పర్తిని అభివృద్ధి చేస్తున్నారు. అసలు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం… రాజధాని, హైకోర్టు ఏదో ఒకటి రాయలసీమలో ఏర్పాటు చేయాలని చెప్పగా, వాటిని పెడచెవిని పెట్టి అమరావతికి లాక్కెళ్ళింది ఈ బాబే. పోనీ తరువాత మూడు రాజధానుల అంశాన్ని అమలుచేద్దామన్నా ప్రతి దశలోనూ కాలు అడ్డుపెట్టి ఆపింది ఈ బాబే. ఈ బాబు రాయలసీమకు పక్కా ద్రోహి. అతని దృష్టిలో రాయలసీమ అనేది తనకు కావలసిన ఓట్లు గుద్దే ఒక ప్రాంతం. అంతే!!