వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాలేదని, పరిశ్రమలు ఏర్పాటు కాలేదని చంద్రబాబునాయుడు అండ్ గ్యాంగ్ ఊదరగొడుతూ ఉంటుంది. ఇక ఎల్లో మీడియా ఈ అంశంపై చేసే దుష్ప్రచారానికి అంతే లేదు. కానీ అదంతా వాస్తవం కాదు. జగన్ హయాంలో రాష్ట్రం గణనీయమైన పారిశ్రామికాభివృద్ధిని సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంతో పోల్చుకుంటే పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో మన రాష్ట్రం 98.3 శాతం స్కోర్‌తో మొదటి స్థానంలో ఉంది. ఈ విషయాన్ని స్వయానా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2014లో రూ.2,804 కోట్లతో 29 ప్రాజెక్టులు, 2015లో రూ.4,542 కోట్లతో 51, 2016లో రూ.11,395 కోట్లతో 79, 2017లో రూ.4,509 కోట్లతో 62, 2018లో రూ.9,553 కోట్లతో 72 ప్రాజెక్టులు వచ్చాయి. కేవలం రూ.32,803 కోట్లు వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అదే జగన్ సీఎం అయ్యాక 2019 నుంచి జూన్ 2023 వరకు రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. బాబు ఐదేళ్లలో కేవలం రూ.32 వేల కోట్లు తెస్తే జగన్ ఒక్క 2019లోనే రూ.34,696 కోట్లతో 73 ప్రాజెక్టులను తెచ్చారు. ■2020లో కరోనా మహమ్మారి కారణంగా కొంతమేర క్షీణించింది. అయినా రూ.9,840 కోట్లతో 42 ప్రాజెక్టులు వచ్చాయి. 2021లో రూ.10,350 కోట్లతో 47, 2022లో రూ.45,217 కోట్లతో 46 ప్రాజెక్టులు వచ్చాయి. 2023లో జూన్ వరకు చూసుకుంటే రూ.7,135 కోట్లతో 26 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.
వాస్తవ పెట్టుబడులు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్ హయాంలో 226.9 శాతం అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పే పచ్చ మాఫియాకు ఈ వృద్ధి నచ్చకపోవచ్చు. కానీ ఇది నిజం. చంద్రబాబు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పేవారు. ఏ దేశానికి వెళ్తే అక్కడి పెద్ద పెద్ద కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం చేసేవారు. దావోస్‌నే రాష్ట్రానికి తీసుకొస్తానని కాకమ్మ కబుర్లు చెప్పారు. కానీ జరిగింది వేరు. హంగు, ఆర్భాటాలకు దూరంగా జగన్ పనిచేసుకుంటూ వెళ్లారు. దీంతో వాస్తవ పెట్టుబడులు రూ.లక్ష కోట్ల పైనే ఉన్నాయి. ఈ విషయాలను జాతి మీడియా గుర్తించకపోయినా.. జాతీయ మీడియా ఏనాడో గుర్తించింది.