2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో పది రోజుల్లో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో పలువురు నేతలు ప్రత్యర్ధి పార్టీలపైన విరుచుకుపడుతూ ఎన్నికల రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. తాజాగా పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ, బీజేపీపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీలతోనే పొత్తులు పెట్టుకున్నారని 2019 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ నేడు ఎలా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ నువ్వు గెలవాలంటే జగన్ ను ఓడించాలని కాదు.. నువ్వు గెలవాలి అన్నదే లక్ష్యంగా పెట్టుకో అని హితబోధ చేశారు. అసలు నేను ఎలా గెలవాలి? నేను గెలవాలంటే ఏం చెయ్యాలి? అనేది ఆలోచించాలని కానీ పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు చేసే తీరుకు పొంతన ఉండదు అని వ్యాఖ్యానించారు.
అతి సామాన్యులకు సీట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు డబ్బుంటే తప్ప రాజకీయాలు చేయలేమని పవన్ కళ్యాణ్ మాటలు చెబుతున్నాడు. పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్న ఎంతోమంది సామాన్యులు మోసపోయారు. పవన్ కళ్యాణ్ మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. 2024 సార్వత్రిక ఎన్నికలలో సింహం లా సింగిల్ గా జగన్ వెళ్తున్నారని, అసలు పవన్ కళ్యాణ్ కు జగన్ తో ఎలాంటి పోలిక లేదని పోసాని కృష్ణమురళి మీడియాకు వెల్లడించారు.