తెలుగుదేశం, జనసేన కార్యకర్తల ట్రోలింగ్ వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి కారణమైన వారిని వదిలే ప్రసక్తి లేదని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. మంగళవారం ఆమె వివరాలు వెల్లడించారు. ఆమె జగనన్న వల్ల తన కుటుంబానికి జరిగిన మంచి జరిగిందని చెప్పింది. ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించాం. కేసు నమోదు చేశాం. దోషులను వదిలిపెట్టం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామన్నారు .
గీతాంజలి కుటుంబ సభ్యులను మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల వెంకటలక్ష్మి పరామర్శించారు. మహిళపై ట్రోలింగ్ అత్యంత హేయమని ఆమె అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతాం. ప్రభుత్వం వద్ద లబ్ధి పొందామని చెప్పడాన్ని ఐ టీడీపీ వాళ్లు సహించలేకపోయారు. ఈ రోజుల్లో మహిళలను ట్రోల్ చేయడం సర్వసాధారణమైంది. అలాంటి సమస్య ఉంటే భయపడకుండా పోలీస్స్టేషన్లో లేదా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లమని ఆమె తెలిపారు .
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం నాయకులు లోకేశ్, బాలకృష్ణకు మహిళలంటే లోకువని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ అంటేనే దుశ్శాసన పార్టీ. పేదలకు సొంత ఇల్లు ఇస్తుంటే దానిని శ్మశానంతో పోల్చారు. టీడీపీ, జనసేన సైకోలు సోషల్ మీడియాలో వేధించడం వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణంతో కుటుంబం రోడ్డున పడింది. మహిళలు భయపడవద్దు. జగన్ అన్న తోడుగా ఉన్నాడు. దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సమస్యలుంటే తెలియజేయండని పిలుపిచ్చారు.
సమాజంలో టీడీపీ, జనసేన వారిని మృగాలుగా చూడాలని ఎమ్మెల్సీ పోతుల సునీత అభిప్రాయపడ్డారు. ఆ రెండు పార్టీల మూకలు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. గీతాంజలి బిడ్డలను చూసి కూడా కనికరం లేకుండా మాట్లాడుతున్నారు. తనకు జగనన్న వల్ల పథకాలు వచ్చాయని చెబితే ట్రోల్ చేస్తారా.. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.