టీడీపీకి ఓటు వేయండి’ అంటూ కొద్దిరోజులు పచ్చ మూక ప్రజలకు ఐవీఆర్ కాల్స్ చేయిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఎల్లో మీడియా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తోంది.
‘వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు. కాజేస్తాడు. ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు. మీకు జెరాక్స్ కాపీలొస్తాయి. అందువల్ల టీడీపీకి ఓటు వేయండి’ అంటూ కొద్దిరోజులు పచ్చ మూక ప్రజలకు ఐవీఆర్ కాల్స్ చేయిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఎల్లో మీడియా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తోంది. ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దీనిపై ఈసీ కొరడా ఝుళిపించింది. చంద్రబాబు గ్యాంగ్ తీరును తప్పు పడుతూ సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది.
ఎన్నికల్లో గెలవలేమని చంద్రబాబుకు అర్థమైపోయింది. దీంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు పడరానిపాట్లు పడుతున్నాడు. ఇందులో భాగంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై పచ్చ మాఫియా జనానికి తప్పుడు సమాచారాన్ని చేరవేస్తోంది. జగన్ వస్తే భూమి లాక్కుంటాడంటూ పత్రికల్లో, సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లలో ప్రచారం చేస్తున్నారు. ఇది సాధ్యం కాదని తెలిసినా, అసలు ఆ యాక్ట్ తెచ్చింది తాము పొత్తులో ఉన్న కేంద్రంలోని బీజేపీ అని తెలిసినా జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 29వ తేదీన టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. యాక్ట్‌పై ఐవీఆర్ కాల్స్‌తోపాటు సోషల్ మీడియాలో ఎలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆధారాలను సమర్పించారు. దీంతో అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ స్పందించారు. తెలుగుదేశం దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై వెంటనే నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్ సెల్) అడిషనల్ డీజీని ఆదేశించారు.
చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టి తర్వాత ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. అందుకే అమల్లో లేని చట్టంపై టీడీపీ తోక పార్టీల ద్వారా అబద్ధాలు చెప్పిస్తున్నారు. పవన్ ఎల్లో స్క్రిప్ట్‌ను బట్టీపట్టి నోటికొచ్చింది చెబుతున్నారు. టీడీపీ చేస్తోంది దుష్ప్రచారం అని తెలిసినా ఓ వర్గం మాత్రం దానిని సమర్థిస్తూ వైఎస్సార్సీపీ బురద వేస్తోంది. బాబూ ఇవి 1980, 90ల రోజుల కాదు. కాస్త బయటికి రండి.