ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ మొన్న ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఆవేశంతో తన వ్యక్తిత్వాన్ని మసకబార్చుకుంటే ఇప్పుడు మరోసారి మళ్ళీ అదే పరిస్థితిని ఎదుర్కున్నారు. ఈ దఫా ప్రముఖ జర్నలిస్ట్ శ్రీనివాసన్ జైన్ వేసిన ప్రశ్నలకు తడబడుతూ దాటవేసే సమాధానలు చెబుతూ కాస్త ఇబ్బంది పడినట్టు కనిపించింది.
వివరాల్లోకి వెళితే ప్రముఖ జర్నలిస్ట్ శ్రీనివాసన్ జైన్ తో సాగిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయలకు సంబంధించి పెద్ద చర్చే నడిచింది. శ్రీనివాసన్ జైన్ చంద్రబాబుకి మీరు పనిచేశారా అని అడగగా ప్రశాంత్ సమాధానం చెబుతూ లేదు కలిశాను. నా మీద ఆయనకు కొన్ని అనుమానాలు ఉంటే సమాధానం చెప్పడానికి వెళ్ళానని స్పష్టం చేశారు. దీంతో శ్రీనివాసన్ జైన్ నేను ఏపీ వెళ్లి కొంత మందిని ఇంటర్వ్యూ చేసాను, టీడీపీ నేత మాగుంట శ్రీనివాస రెడ్డి డైరెక్ట్ గా నాతో చెప్పారు ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు ఇద్దరూ నన్ను టీడీపీ లోకి రమ్మని ఆహ్వానించారు అందుకే వచ్చానని చెప్పారు, దీనిపై మీ సమాధానం అని కోరగా లేదు నేను ఫ్రెండ్లీగా మాత్రమే మాగుంటకు సలహా ఇచ్చానని బుకాయించే ప్రయత్నం చేశారు ప్రశాంత్ కిషోర్.
మీరు ఈ మధ్య ఫలానా పార్టీ ఓడిపోతుంది, ఫలానా పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి అని చెబుతున్నారు మీరు సర్వేలు చేసి చెబుతున్నారా అని శ్రీనివాసన్ జైన్ అడగగా నేను ఎలాంటి సర్వేలు చేయలేదు నా ఊహాగానాలు మత్రమే చెబుతున్నాను నేను నా డ్రాయింగ్ రూం లో కూర్చుని వేసిన అంచనా మాత్రమే అని తన మాటల్లోని డొల్లతనాన్ని బయట పెట్టుకున్నారు ప్రశాంత్ కిషోర్. కరణ్ థాపర్ ఇంటర్వ్యుతో హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంలేదని చెప్పిన తన సర్వేలు ఫెయిల్ అయిన విషయం బయట పడితే శ్రీనివాసన్ జైన్ తో సాగిన ఇంటర్వ్యూలో తాను సర్వేలు చేయకుండా వట్టి ఊహాగానాలు మాత్రమే చెప్పానని చెప్పిన విషయం బయట పడింది. జగన్ లూజింగ్ బిగ్ అంటూ చేసిన వాఖ్యలు వెనుక ఎలాంటి హేతుబద్దమైన సర్వే లేదని తేలడంతో ఇన్నిరోజులు ప్రశాంత్ కిషోర్ మాటలకి సంబర పడ్డ తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా డీలా పడ్డారు.