మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమనేత చేగొండి హరిరామ జోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తునట్టు వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీలో క్రీయాశీలక సభ్యునిగా జనసేన పొలిటికల్ ఎఫైర్స్ సభ్యుడిగా కీలకంగా వ్యవహరించిన సూర్యప్రకాష్, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి చేస్తున్న పొత్తు రాజకీయంతో తీవ్రంగా విభేదిస్తునట్టు తెలుస్తుంది.
2018లో జనసేనలో చేరిన చేగొండి సూర్యప్రకాష్ , పార్టీని బలోపేతం చేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేసినా చివరికి పవన్ కళ్యాణ్ నుండి పార్టీ బలోపేతానికి సరైన సహకారం లభించపోయినప్పటికి ఆ పార్టీలోనే ఉన్నారు సూర్యప్రకాష్. ఈ నేపధ్యంలో చంద్రబాబుతో పొత్తులో పవన్ కళ్యాణ్ 24 సీట్లు మాత్రమే తీసుకుని తన పార్టీని కాకుండా తెలుగుదేశాన్ని బలోపేతం చేయడంలోనే తీవ్ర కృషి చేయడం మింగుడుపడని కాపునేతలు ఇప్పటికే ఆ పార్టీనుండి దూరం జరుగుతూ వస్తున్నరు.
కాపులు అంతా ఐక్యతగా ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని చెబుతూ లేఖలు రాసే హరిరామ జోగయ్య సైతం పొత్తు విషయంలో, సీట్ల పంపకాల విషయంలో, పవర్ షేరింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ కి ఎంతో చెప్పి చూసినా పవన్ వాటిని పాటించకపోగా వేధికపైనుండి తిరిగి జోగయ్య లాంటీ సీనియర్ కాపు నాయకులనే పరోక్షంగా హెచ్చిరించడంతో. కాపు సామాజిక వర్గం తీవ్రంగా పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకిస్తుంది. ఈ నేపధ్యంలోనే జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి గుడ్ బై చెప్పి మరికాసేపట్లో సీఎం జగన్ ని కలిసి వైసీపీలో చేరుతునట్టు వార్తలు వస్తున్నాయి..