‘మా మామ నందమూరి బాలకృష్ణ వల్ల మ్యాన్షన్హౌస్ వాల్యూ చాలా పెరిగిపోయింది. ఆయన వెంట ఎప్పుడూ బ్యాగ్ ఉంటుంది. ఫుల్ బాటిల్, హాట్ వాటర్ అందులో ఉంటాయి. ఎక్కడికి వెళ్లినా ఇవి ఉండాల్సిందే. అమెరికా వచ్చినా తీసుకొస్తారు. చాలా రాయల్టీ మామయ్య’ విశాఖపట్నం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ బాలకృష్ణపై ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివి. ఈ విషయాలను ఆయన నవ్వుతూ చాలా గర్వంగా చెప్పడం విశేషం.
భరత్ గీతం విద్యాసంస్థల అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి మద్యంను ప్రోత్సహిస్తూ మాట్లాడడాన్ని చూస్తే అతను ఏ స్థాయిలో దిగజారిపోయాడో అర్థం చేసుకోవచ్చు. తమ వద్ద చదువుకునే పిల్లలకు మంచి మాటలు చెప్పి.. సన్మార్గంలో నడిపించాల్సిన ఈయన తన మామ మద్యం విషయంలో రాయల్టీగా ఉంటాడని చెప్పి అభాసుపాలయ్యాడు.
ఇక బాలకృష్ణ విషయానికొస్తే మొదటి నుంచి వివాదాస్పదుడే. మహిళలను చులకనగా చూస్తుంటాడు. సినీ ఫంక్షన్లకు మద్యం తాగొచ్చి నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తోటి నటీమణులను కోరికలు తీర్చాలంటూ ఇబ్బంది పెట్టగా వారు ఇంటర్వ్యూల్లో చెప్పుకొని బోరున విలపించారు. బాలకృష్ణ ఎంతటి తాగుబోతో స్వయానా ఆయన అల్లుడే వివరించాడు. ఎక్కడికెళ్లినా మద్యం బాటిల్, హాట్ వాటర్ తీసుకెళ్తుంటాడని చెప్పాడు. దీనిని బట్టి హీరో వారు నిత్యం మత్తులో ఉంటాడని అర్థమవుతోంది.
దారుణ మనస్తత్వం కలిగిన మామాఅల్లుళ్లు సమాజాన్ని ఉద్ధరించేందుకు బయలుదేరారు. భరత్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా, బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అల్లుడు మద్యాన్ని ఎంకరేజ్ చేసే వ్యక్తి. మామ పచ్చి తాగుబోతు. వీరిని గెలిపిస్తే తమ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తారో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. భరత్ తన విద్యాసంస్థల్లో స్వేచ్ఛగా మందు తాగొచ్చని రూల్ తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వీధిలో మ్యాన్షన్ హౌస్ దొరికేలా చూడాలని తన బావ చంద్రబాబు నాయుడికి చెప్పినా చెబుతాడు.