బాలకృష్ణ చిన్నాల్లుడు గీతం శ్రీభరత్ సంచలన వ్యాఖ్యలతో వైజాగ్ ఎంపీ పరిధిలో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ఒక న్యూస్ చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వం అంటే గూండా అని అది టీడీపీ అయిన వైసీపీ అయిన ఒక్కటే అంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ డబ్బు ఖర్చు చేస్తేనే ప్రజలు పార్టీ కార్యకర్తలు మన చుట్టూ ఉంటారు, డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఎవరూ ఉండరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయా నాయకుల దగ్గరకు విద్య,వైద్య, ఆరోగ్య అవసరాల కోసం ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారు. అలాగే జనాలు వచ్చి గుడులు కట్టడానికి డబ్బులు అడుగుతారు. నేను మనీ పాలిటిక్స్ కు దూరం అంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు.
నాకు రాష్ట్ర ప్రభుత్వంతో పని చెయ్యడం ఇష్టం లేదు, రాష్ట్ర ప్రభుత్వంకు మనం వ్యతిరేకంగా మాట్లాడితే ఏదైనా లోపం వెతికి ఇబ్బందులు పెడుతారు అందుకే నేను ఎమ్మెల్యేగా పోటీ చెయ్యకుండా కేవలం ఎంపీ గా పోటీ చేస్తున్నానని తెలిపారు. అంతే కాకుండా ఎంపీ అభ్యర్థి నిధుల విషయంలో ఎవరి జోక్యం ఉండదని, తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థులే ఖర్చు పెట్టుకొని ఎంపీగా నన్ను గెలిపిస్తారు అంటూ మాట్లాడే సరికి వైజాగ్ ఎంపీ కింద వున్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు. అసలే ఇప్పటి వరకు ఇస్తా అని చెప్పిన అమౌంట్ ఇవ్వలేదు ఇప్పుడేమో ఎమ్మెల్యే అభ్యర్థులే ఖర్చు పెట్టుకోని గెలిపిస్తారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇలా అయితే మా డబ్బులతో ఎంపీగా శ్రీభరత్ ను దేనికి గెలిపించాలని గుర్రుగా ఉన్నారు.
బాబు హయాంలో గీతం యూనివర్శిటి పరిధిలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తన సంస్థ పేరు మీద మార్చుకొని, వేల కోట్ల అధిపతిగా మారిన భరత్ ఈరోజు ఎమ్మెల్యేలే తనను గెలిపించాలని మాట్లాడటం సమంజసంగా లేదు అంటూ తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. భరత్ తన కమిట్మెంట్ ను నెరవేర్చాలని అలా కాకుంటే టీడీపీకి ఓటమికి మాది భాధ్యత కాదు అని స్టేట్మెంట్ రిలీజు చేసారు. భరత్ వ్యవహారశైలి చూసిన వారు రూపాయి ఖర్చు లేకుండా అన్ని తన దగ్గరకే రావాలి అంటే కుదరదు అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.