తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటన ఇచ్చింది. గంటా విశాఖ నార్త్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడటంతో రాజీనామా చేశానని ఆయన రెండేళ్ల క్రితం చెప్పారు. అయితే కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా చేయలేదని ఆనాడు ప్రచారం జరిగింది.
రాజకీయాల్లో తన ఉనికి కాపాడుకునేందుకు డ్రామా ఆడారని చెబుతుంటారు. శ్రీనివాసరావుది నిలకడ లేని మనస్తత్వం. పలు పార్టీల్లో చేరి బయటికొచ్చిన చరిత్ర ఉంది. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థం కాక తర్జనభర్జన పడుతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. దీంతో జనానికి తనపై అయిష్టత ఏర్పడిందని భావించి సరైన అసెంబ్లీ స్థానం కోసం వెతుకులాటలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గంటా రాజీనామాకు ఆమోదముద్ర పడటం విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.