ఓ అమాయక జన సైనికుడికి ఆత్మకు అంతరాత్మకు మధ్య జరిగిన సంభాషణ..
ఆత్మ: రేయ్ మా పవన్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా మావోడే గెలిచి ఎట్టాగైనా సీఎం అయిపోతాడు.
అంతరాత్మ: అదేంట్రా.. అందరూ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నాడని అంటున్నారు. నిజమేనా?
ఆత్మ: ఔన్రోయ్.. ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎం.. అదే ఎంపీగా గెలిస్తే ఏకంగా పీఎం.. ఈసారి అటో ఇటో తేలిపోవాలి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి.
అంతరాత్మ: అంటే ఎమ్మెల్యేకి ఓ రెండు సీట్లు, ఎంపీకి రెండు సీట్లు.. అంటే ఈసారి నాలుగు సీట్లలో పవన్ పోటీ చేస్తాడు అంతేనా.. ?
ఆత్మ: నాలుగు కాకుంటే నలభై సీట్లలో పోటీ చేస్తాడు. నీకేంటి బాధ.. ఈసారి సీఎం.. అదీ వీలు కాకుంటే పీఎం కావడం మాత్రం ఖాయం..
అంతరాత్మ: నలభై కాకుంటే నాలుగు వందల సీట్లలో పోటీ చేయమను.. కానీ మీవాడికి పొత్తులో భాగంగా మిగిలినవే రెండు ఎంపీ సీట్లు.. ఆ రెండిటిలో అతనే పోటీ చేస్తే ఆ నాగబాబు, బాలశౌరి పరిస్థితి ఏంటి?
ఆత్మ: దానికీ మావోడు ఏదొక ఏర్పాటు చేసే ఉంటాడులే.. ప్రధాని మోడీకి పవన్ ఎంత చెప్తే అంత.. ఏ తెలంగాణలోనో, తమిళనాడులోనో ఏవో రెండు ఎంపీ సీట్లు పవన్ అడిగితే ఇవ్వకపోడా?
అంతరాత్మ: రేయ్ నిజం చెప్పు.. మీవాడికి సరిగా అపాయింట్మెంట్లే ఇవ్వడు. అలాంటిది ఎంపీ సీట్లు ఇస్తాడా.? ఇప్పటికే చేతిలో ఉన్న మూడు ఎంపీ సీట్లలో ఒకటి లాగేసుకున్నాడు.
ఆత్మ: ఎహె ఒకటి లాక్కుంది రెండు ఇవ్వడానికే.. ఇప్పుడు నమ్మవులే కానీ ఇచ్చాక నమ్ముతావులే..
అంతరాత్మ: అది సరేకానీ ఈసారి పిఠాపురంలో వంగా గీతపై గెలుస్తాడంటావా? అసలే పోయినసారి పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు.
ఆత్మ: అసలు డౌటే అక్కరలేదు. ఈసారి పక్కాగా రెండు చోట్లా గెలుస్తాడు.
అంతరాత్మ: అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావ్?
ఆత్మ: వంగా గీతకంటే అన్ని విషయాల్లో మా వాడే ముందున్నాడు. పవన్ కున్న క్రేజ్ & సర్వీస్ ముందు వంగా గీత తేలిపోతుంది. ఆఖరికి చదువులో కూడా మా పవన్ ముందున్నాడు.
అంతరాత్మ: సర్వీసులో, చదువులో ముందుండటం ఏంట్రా.. మతి గానీ పోయిందా? ఆవిడ అనేక ఉన్నతపదవులు పొంది ఎప్పటినుండో ప్రజాసేవ చేస్తుంది. వంగా గీత డబుల్ ఎల్ఎల్ బీతో పాటు డబుల్ ఎమ్ఎల్ చేసింది. పైగా సైకాలజీలో మాస్టర్ పట్టా పొందింది. ఎన్సీసీతో పాటు ఎన్ఎస్ఎస్ లో కూడా సత్తా చాటింది. సేవలో ఆల్మోస్ట్ ప్రతీసారి ముందుంది. మరి పవన్ ఎలా ముందుంటాడు?
ఆత్మ: అదేమరీ చదువంటే కేవలం కాలేజీల్లో చెప్పే పాఠాలు అప్పజెప్పడం కాదు. లోకజ్ఞానం పెంచుకోవడం.. మా పవన్ 10th లో ఫెయిల్ అయ్యి గ్రేస్ మార్కులతో పాస్ అయినా,ఇంటర్ ఎమ్ఈసీ,ఎంపీసీ, సీఈసి, హెచ్ ఈసీలో ఫెయిల్ అయినా సరే సినిమాలో ఆయనకున్న గ్రేస్ ముందు అన్నీ పాస్ అయిపోతాయి. ఆవిడేదో రెండు డిగ్రీలు చేసి గొప్పలు చెప్పుకోవడం కాదు. వంగా గీత కనీసం పది పాఠ్య పుస్తకాలు చదివి ఉంటుందా. అదే మావోడైతే రెండు లచ్చల్ పుస్తకాలు చదివాడు. షూటింగ్ గ్యాప్ లో కూడా ఏదొక బుక్ చదువుతూనే ఉంటాడు. అంతటి జ్ఞానితో వంగా గీతకు పోలికా? ఎవరైనా వింటే నవ్వి పోతారు.
అంతరాత్మ: ఒరేయ్.. పిచ్చి నీకు పట్టిందా లేక పిచ్చికే నువ్వు పట్టావా?
ఆత్మ : అవును పిచ్చే.. పవన్ సినిమా అంటే చెప్పలేని పిచ్చి. పవన్ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో 10000 పెట్టైనా కొంటాం. ఆ డబ్బుల వల్లే పవన్ ఇప్పుడు రాజకీయాల్లో సేవ చేయడానికి ముందుంటున్నాడు.
అంతరాత్మ: పవన్ సినిమాలకు ఫస్ట్ డే చూడటానికి బ్లాక్ లో టికెట్లు కొంటావ్ కానీ లైన్ లో నిలబడి ఓటు మాత్రం వేయవు అంతేనా..
ఆత్మ : ఏం మాట్లాడుతున్నావ్.. పవనన్నకి ప్రాణం ఇస్తా.. జగనన్నకు ఓటేస్తా..
అంతరాత్మ: సరిపోయింది సంబరం.. ఇక మీ అన్న సీఎం అయినట్లే..
ఆత్మ : మావోడు ఓడిపోయినా సీఎం ఏ బ్రో..