– మరో 2.32 లక్షల ఇళ్లకు అనుమతి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు
రాష్ట్రంలోని వైఎస్సార్, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. డిసెంబర్ నెలలో మెగా కంప్లీషన్ డ్రైవ్ నిర్వహించి 2.25 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేశారు. మరోవైపు కొత్తగా 2.35 లక్షల ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.
ఈ మేరకు వివరాలను గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. కాలనీల్లో మౌలిక వసతులు సమకూర్చాలని ఇప్పటికే సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించామన్నారు. రూఫ్ లెవల్ దాటిన నిర్మాణాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.35 వేల రుణాన్ని లబ్ధిదారులకు వెంటనే మంజూరు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా మహిళలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను ఉచితంగా ఇచ్చిన విషయం తెలిసిందే.