ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఏపీ ఎన్డీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం తాము ప్రతిపాదించిన సమస్యలును పరిష్కరిస్తాం అని అనడంతో 27వ తేదీ జరగాల్సిన చలో విజయవాడను వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీ ఎన్డీవో అసోసియేషన్ నిర్మించిన కాంప్లెక్స్ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వంకు తాము ప్రతిపాదించిన జీపీఎఫ్ సంబంధించిన రూ.70కోట్లు, సిపిఎస్ కు సంబంధించిన రూ.100కోట్లు, మెడికల్ బిల్లుల కోసం రూ.40కోట్లను చెల్లించేందుకు మార్చి నెలాఖరుకు ఈ బిల్లులు అన్ని క్లియర్ అవుతాయి అని తెలిపారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని , ఇప్పటికే కమిషనర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు , పీఆర్సీ లేట్ అయిన యెడల ఐ ఆర్ ఇవ్వడానికి ప్రభుత్వంకు సిద్ధంగా ఉందని సాధ్యమైనంత వరకు పీఆర్సీ నే త్వరగా ఇస్తామని ప్రభుత్వం తెలిపిందిన్నారు. ఈ కార్యక్రమంలో అసోసి యేషన్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శరత్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.