ప్యాకేజ్ స్టార్‌గా తెలుగు రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ద్వారా టీడీపీ నుంచి విడతల వారీగా ప్యాకెజిలు అందుకుంటారనే ఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఒకానొక సమయంలో టీడీపీ వారే మా దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు అని తమ దత్త పుత్రుడు పవన్‌ని బహిరంగంగానే విమర్శించారు.
అయితే ఇప్పుడు పవన్ తన పార్టీ ద్వారా మరొక కొత్త రకం పాకేజ్ కు తెర లేపారు. సాధారణంగా ఎన్నికలు వచ్చినపుడు పార్టీలు తమ అభిమానులను పార్టీ ఫండ్ అడగడం మామూలే. ఆశావహులు, ఆర్ధికంగా బలంగా ఉన్న అభిమానులు, రాజకీయపార్టీలతో ఎందుకొచ్చిన గొడవ అనుకునే వ్యాపారస్తులు ఈ రకంగా తమ డొనేషన్లు ఇస్తారు. వీటిని రాజకీయ పార్టీలు ఎలెక్టోరల్ బాండ్స్ అని పిలుస్తాయి.
అయితే ఇప్పుడు జనసేన ఎలెక్టోరల్ బాండ్స్ ద్వారా 21 కోట్ల విరాళాలు పొందిన గుర్తింపు లేని పార్టీగా ఆవిర్భవించింది. గుర్తింపు లేని పార్టీ అంటే కొత్త పార్టీ లేదా తగినన్ని ఓట్లు కూడా సాధించుకోని పార్టీ. 2014 లో పార్టీ ఆవిర్భవించినా ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 లో పోటీ చేసినా కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటుని మాత్రమే గెలుచుకుంది. అందువల్ల జనసేన ఎన్నికల కమీషన్ దృష్టిలో గుర్తింపు లేని పార్టీ అన్నమాట.
ఇది ఇలా ఉంటే జనసేనకు 2022 లో రెండు కోట్లు, 2023 లో రెండు కోట్లు మాత్రమే విరాళాలుగా వచ్చాయి. కానీ 2024 లో టీడీపీతో పొత్తు ప్రకటించాక.. పవన్ ను విమర్శించిన జనసైనికులే ఎక్కువగా ఉండి, చాలామంది కాపు నాయకులు ఆయనకు దూరంగా జరిగారు. అయినా కానీ కేవలం మూడు నెలల్లో పదిహేడు కోట్ల విరాళాలు వచ్చి పడ్డాయి. దీని వెనుక మతలబు అంతా చంద్రబాబు నాయుడే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.కూటమికి అవసరమయిన విరాళాలను ఇలా జనసేన ఖాతాకు మళ్ళించడం పొత్తు ధర్మంలో భాగమేమో అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు కూడా.