దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తన కసరత్తును ముమ్మరం చేసింది. నేడు ఎన్నికల సంఘం కీలక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఎన్నికల షెడ్యూల్ విషయం కూడా ఈ మీటింగ్ లో తెలిసే వీలుంది. ఇదే విధంగా ఓట్ల ప్రజాస్వామిక ప్రక్రియను స్వేచ్ఛగా సజావుగా నిర్వహించేందుకు పాటించాల్సిన పద్ధతుల గురించి కూడా ఎన్నికల సంఘం అధికారులు అబ్జర్వర్స్తో సమీక్షిస్తారని వెల్లడైంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి , కమిషనర్లు దేశ వ్యాప్తంగా పర్యటించారు. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మీటింగ్ లో ఎన్నికల ప్రకటన వెలువరించవచ్చు . ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుకు వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టి శిక్షణ ఇచ్చింది.
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రెస్మీట్ ని నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్రాలని పర్యటించి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ రాష్ట్రాలకి ఎంతమంది పోలీసులు కావాలి, ఎంతమంది కేంద్ర బలగాలు కావాలి కేటాయింపులు జరిగిపోయాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా EVM లు జిల్లా కేంద్రాలకు పంపించడం, EVM ల మీద ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఓటర్ ఫైనల్ లిస్ట్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది.ఓటర్ లిస్ట్ అభ్యంతరాలను కూడా ఎన్నికల సంఘం స్వీకరించింది