డ్వాక్రా రుణాలు మాఫీ చేసే అంశాన్ని పరిశిలిస్తున్నామని, వీలైనంట వరకూ చేసేస్తామని లెటర్ పాడ్ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్.
ఇలా అత్యంత సులువుగా నోటికొచ్చిన హామీ ఇచ్చే శక్తి గతంలో చంద్రబాబు కుండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అబ్బింది.
ద్వాక్రా రుణమాఫీ చేస్తానని 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బాబు అధికారం వచ్చాక ఒక్క రూపాయి మాఫీ చేయకపోవడంతో అప్పుల పాలయ్యారు ఏపీ మహిళలు.
నాడు టీడీపీ ఇచ్చిన హామీలకు నాది పూచి అన్న పవన్ కళ్యాణ్ . ఒక్క రూపాయి అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుని ఇదేంటి అని ప్రశ్నించిన పాపాన పోలేదు.
నేడు మళ్ళీ అదే హామీ చంద్రబాబు ఇస్తే నమ్మరని తెలివిగా పవన్ కళ్యాణ్ చేత చెప్పిస్తున్నాడు బాబు . కానీ ఆ రోజు ఉమ్మడిగా ఇచ్చిన హామీని అమలు చేయకపోయినా టీడీపీని ప్రశ్నించని, నమ్మిన జనాలకి సమాధానం చెప్పని పవన్ కళ్యాణ్ మళ్ళీ మహిళలకి రుణమాఫీ అంటూ హామీ ఇవ్వబోవడం మరోసారి మహిళల గొంతు కోసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు.
పోనీ ఉమ్మడిగా కాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అయినా విశ్వసనీయత కాపాడుకొనే వ్యక్తా అంటే, వ్యక్తిగతంగా పవన్ ప్రజలకి హామీ ఇచ్చి మోసం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి . వాటిలో కొన్ని
1, కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి 11 లక్షలు విరాళం ప్రకటించి ఎగగొట్టడం.
2, తన ప్లినరి సభకి భూమిచ్చిన ఊరు అయిన ఇప్పటం గ్రామ అభివృద్ధికి 50 లక్షలు చందా ప్రకటించి ఎగగొట్టాడు .
3, రైల్వే కోడూరులో అతి పెద్ద గ్రంధాలయం నిర్మిస్తానని ఎగగొట్టాడు.
4, భీమవరంలో నూరు అడుగుల అల్లూరి విగ్రహాన్ని కడతానని ఎగగొట్టాడు.
5, దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక భవనంగా నిర్మిస్తానని ఎగగొట్టాడు.
6, వెంకట్ రాహుల్ అనే క్రీడాకారుడికి 10 లక్షలు సహాయం చేస్తానని ఎగగొట్టాడు.
7, మన నది మన నుడి పేరిట నది జలాలు పరిరక్షిస్తానని, తెలుగు నుడి కారాన్ని కాపాడతానని ప్రమాణం చేసి ఎగగొట్టాడు.
8, చారెడు నేల బతుకు బాట పేరిట యువతకి 250 గజాల్లో 81 రకాల పంటలు పందించడం నేర్పిస్తానని ఎగగొట్టాడు .
9, ఇప్పటం గ్రామంలో ఆక్రమణల తొలగింపులో నష్టపోయిన 53 మందికి లక్ష చొప్పున పరిహారం ఇస్తానని 39 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నాడు.
10, సామాన్య జనుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కామన్ మెన్ ప్రొటక్షన్ పోర్స్ సంస్థ, దానికిచ్చిన విరాళం కోటి రూపాయలు మాయం చేశాడు.
ఇలా వ్యక్తిగతంగా ఏ మాత్రం విశ్వసనీయత లేని పవన్, రాజకీయ నేతల్లో మహా మోసగాడిగా పేరున్న చంద్రబాబు కలిసి ఒకసారి చేసిన మోసానికే దారుణంగా దెబ్బతిని ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న జనాన్ని మరోసారి మోసం చేయడానికి పూనుకోవడం హాస్యాస్పదం.
బహుశా జనాల జ్ఞాపక శక్తి మీద పవన్ కి కూడా బాబు గారి లాగే అపార విశ్వాసం కలిగిందేమో.