ఉత్తరాంధ్రలో వైసీపీ పార్టీ అత్యంత ప్రతిష్టత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో టెక్కలి ఒకటి. ఇక్కడ టీడీపీనుండి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటి చేస్తున్నారు. దీనితో ఈ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టత్మకంగా తీసుకొని పార్టీ తరపున బలమైన అభ్యర్థిగా లోకల్ గా మాస్ లీడర్ అయిన దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ కేటాయించారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ కు ఇంటి పోరు రచ్చ కెక్కింది.వారం క్రితం తన భార్య దువ్వాడ వాణి బయటకు వచ్చి నేను నా భర్త మీద స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న 22న నామినేషన్ వేస్తున్న అని ప్రకటించారు.ప్రస్తుతం దువ్వాడ వాణి టెక్కలి జెడ్పీటీసీ గా వున్నారు. గత వారం రోజులుగా టెక్కలిలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యర్ధి పార్టీ టీడీపీ దీని మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు.
గతంలో ఏప్రిల్ నెలలో మూలపాడు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పేరును వైఎస్ జగన్ ప్రకటించారు. దాని తరువాత దువ్వాడ వాణినీ టెక్కలిలో తమ అభ్యర్థిగా ప్రకటించారు. మళ్ళీ టికెట్ కేటాయింపుల సమయంలో దువ్వాడ శ్రీనివాస్ కే పోటీకి అవకాశం కల్పించింది వైసీపీ. తరువాత పార్టీ ప్రచారంలో దూసుకుపోయ్యారు శ్రీనివాస్ . అయితే ఇప్పుడు దువ్వాడ వాణి పోటీకి సై అనడంతో అందరు షాక్ కి గురి అయ్యారు.దీనిమీద శ్రీనివాస్ మాట్లాడుతూ మనది ప్రజాస్వామ్యమైన దేశం ఇక్కడ ఎవరైనా పోటి చెయ్యవచ్చు అంటూ మాట్లాడారు. దీని మీద వైసీపీ పార్టీ పెద్దలు చాలా సిరియస్ గా తీసుకొని శ్రీనివాస్ కు ముందు ఇంటి పోరును సరిదిద్దుకోమని చెప్పారు అలాగే పార్టీ పెద్దలు కూడా చొరవ తీసుకొని దువ్వాడ వాణితో మాట్లాడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వుండకుండా చేసారు. అలాగే తన సంపూర్ణ మద్దతు తన భర్త దువ్వాడ శ్రీనివాస్ కు ఇచ్చేలా బుజ్జగించారు. దీనితో టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
ఇక ఇంటి పోరు ముగియ్యడంతో వైసీపీ కార్యకర్తలు ఉత్యహంగా వుంటే టీడీపీ కార్యకర్తలు ముఖ్యంగా అచ్చెన్నాయుడు దిగలు చెందారు.