నేటి తరానికి తెలియని నిజాలు .
పెంచిన నీటి తీరువ, విద్యుత్ రేట్ల తగ్గించమన్నందుకు రైతన్నలపై కాల్పులు
చంద్రబాబు అధికారంలో ఉండగా తీసుకొన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు, పెంచిన పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిని హింసించిన, దాడులు చేయించిన సంఘటనల్లో బషీర్ బాగ్ కాల్పుల ఘటన ప్రజలందరినీ కలవరపరిచినా.. వెలుగులోకి రాకుండా చంద్రబాబు రాజకీయ హీన చరిత్రలో దాగి ఉన్న మరో సంఘటన మరింత ఘోరమైనది. చంద్రబాబు నీచపు రాజకీయ చేష్టలను తట్టుకోలేక మూడో కన్ను తెరిచిన రైతన్నల ప్రాణాలు తీసిన ఘటన అది.
1996 లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకవైపు కరువు నాశనం చేస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, నీటి తీరువా, కరెంటు చార్జీలు పెంచి రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేసాడు బాబు . టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచిన నీటి తీరువా, విద్యుత్ చార్జీలను తగ్గించమని రైతులు ప్రభుత్వాన్ని అడిగినా చలనం లేకపోవడంతో ఎదురు తిరిగిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
ఆ క్రమంలో ఏలూరులో రైతులు శాంతియుతంగా చేస్తున్న నిరసనలపై కాల్పులు జరిపించి ఇద్దరు రైతుల మరణానికి కారణమయ్యాడు చంద్రబాబు.. సెప్టెంబర్ 4, 1996 న జరిగిన ఈ ఘటనలో మరెంతోమంది రైతులు గాయపడ్డారు .
ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యమించగా, ప్రజాగ్రహానికి భయపడ్డ బాబు రైతుల మృతి పట్ల నామమాత్రపు విచారం వ్యక్తం చేస్తూ ఒక హీనమైన బహిరంగ లేఖను విడుదల చేశారు చంద్రబాబు .
ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరం.. కానీ పెంచిన విద్యుత్ ఛార్జీలను, నీటి తీరువాను తగ్గించడం కుదరదు “ అంటూ చెప్పడం ఆ లేఖ తాత్పర్యం. అంతటి కఠినాత్ముడు చంద్రబాబు.. రైతుల పట్ల, ప్రకృతిపై మాత్రమే ఆధారపడే వారి నిస్సహాయత పట్ల కనీసం దయలేని మూర్ఖుడు చంద్రబాబు..
. ఆనాడు రైతులు కనీస మద్ధతు ధర కోసమో, చంద్రబాబు పూర్తి చెయ్యని ప్రాజెక్టుల గురించో పోరాటం చెయ్యలేదు.. పెంచిన విద్యుత్ ఛార్జీలను, నీటి తీరువాను రైతుల యందు దయ ఉంచి తగ్గించండంటూ పోరాడారు. అలాంటి రైతులను చంపించాడు చంద్రబాబు. అలా గతంలో రైతులను హింసించిన చంద్రబాబు 2014 లో రైతు రుణమాఫీ, వ్యవసాయ బంగారు రుణ మాఫీ, గిట్టుబాటు ధర కల్పన హామీలతో పాటు ఇంకా పలు హామీలు రైతులకు ఇచ్చి మళ్ళీ అధికారంలోకి రాగానే రైతుల నోట్లో మరోసారి మట్టి కొట్టాడు బాబు .
కాలం అన్నిటిని తనలో కలిపేసుకొన్నట్టే తన పాపాలని రైతులకు చేసిన ద్రోహలని కూడా తన గర్భంలో కలిపేసుకొంటుంది అనుకొనే చంద్రబాబు మళ్ళీ ఎన్నికల వేల రైతులకు కొత్త హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. వ్యవసాయం చేసేందుకు రైతులకు ఏడాదికి రూ. 20 వేలు ఇస్తానంటూ హామీ ఇస్తుంటే.. రాష్ట్రంలోని రైతులను ఆదుకుంతాం, అన్ని అవసరాలు తీరుస్తాం అని లోకేష్ హామీలిస్తున్నాడు.. ఒకరకంగా ఆలోచిస్తే ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం 1996 నుండి 2004 వరకు వెనకపడడానికి కారణమే చంద్రబాబు.. అలాంటి వ్యక్తి ఎప్పటికీ రైతులకు అండగా నిలవలేడు అనేది సత్యం.