దేశంలో ఎన్నికల నగారా మోగింది. మోత్తం ఏడుదశల్లో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్దమైనట్టు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారు రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు.
విలేకరుల సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ కోసం దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను పోల్ అథారిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. మోత్తం 97 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారని, 10.5 లక్షలకు పైగా పోలింగ్ స్టేషన్లలో 1.5 కోట్ల మంది సిబ్బందితో 55 లక్షల ఈవీఎంలను సిద్దంగా చేసినట్టు చెప్పుకొచ్చారు.
10 మార్చ్ 2024 నాటికి దేశం మోత్తం మీద 100 ఏళ్ళు దాటిన ఓటర్ల సంఖ్య 2,18,442 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. 97.8 కోట్ల మంది అర్హులైన ఓటర్లలో, 49.72 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని. అలాగే 1.82 కోట్ల మంది మొదటిసారి ఓటు హక్కు వినియొగించుకునేందుకు సిద్దమగా ఉన్నారని తెలిపారు.
ఎక్కడైనా 100 ఏళ్ళు దాటిన వారు ఒకళ్ళు కనబడితేనే విచిత్రంగా చెప్పుకొంటాం అలాంటిది దేశం మొత్తం మీద రెండు లక్షల పద్దెనిమిది వేళ మంది ఉన్నారంటే ఆశ్చర్యమే. వారి ఆరోగ్య రహస్యం ఏంటో.