సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అక్కడే తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం 2018 సంవత్సరంలో రాష్ట్రానికి సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని జంతులూరు గ్రామంలో కట్టాలని నిర్ణయించారు. అయితే దీని విషయంలో అప్పట్లో చంద్రబాబు రాజకీయాలు చేశాడు. వెనుకబడిన రాయలసీమకు వర్సిటీ నిర్మాణం అనేది పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టంలోని హామీ. క్యాంపస్‌ను తామే కట్టిస్తామని కేంద్రం ముందుకు వచ్చినా బాబు ప్రభుత్వం ఒక్క ఎకరా భూమిని కేటాయించలేదు. దీనికి కారణాలు లేకపోలేదు. రాయలసీమకు ఆ వర్సిటీ అవసరం లేదని, అక్కడ భూములు ఇచ్చేది లేదని, అమరావతికి మార్చాలని కేంద్రంతో నారా వారు లాబీయింగ్ చేశాడు. ఎందుకంటే అమరావతిలో తన బినామీలు కొన్న భూముల వద్ద ఈ విశ్వవిద్యాలయాన్ని పెడితే వాళ్లందరి భూములకు రియల్ ఎస్టేట్‌లో మంచి ధర వస్తుందని స్కెచ్ వేశాడు. కానీ బాబు పాచికలు పారలేదు.æరాయలసీమలో బాబు సర్కార్ భూములు ఇవ్వడంలేదని కేంద్రం ఆనాడు వర్సిటీ నిర్మాణం గురించి పట్టించుకోలేదు.
జగన్ సీఎం అయ్యాక..
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులు పట్టాలెక్కేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి. తొలుత అనుకున్నట్లుగా అనంతపురం జిల్లాలోనే దీని నిర్మాణం జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. భూ కేటాయింపులు వేగంగా చేసి అప్పగించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తెప్పించారు. దీంతో అనంతపురానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న జంతులూరులో శాశ్వత భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నిధులతో పనులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ప్రత్యేక 33 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. క్యాంపస్‌కు తాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వర్సిటీ అనంతపురం శివారుల్లోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ భవనంలో నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో అది వివిధ రాష్ట్రాల విద్యార్థులకు సరిపోవడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వహించేలా జగన్ చర్యలు తీసుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాబు అంతే..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క పని సక్రమంగా చేయలేదు. అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపించి కాలయాపన చేశాడు. సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో దిక్కుమాలిన రాజకీయాలు చేసి చెడ్డపేరు మూటగట్టుకున్నాడు. అప్పుడే స్పందించి ఉంటే విద్యార్థులకు ఎంతోమేలు జరిగేది. అయితే తన మనుషులకు లబ్ధి జరిగేలా వ్యవహరించాడు. అభివృద్ధి విషయంలో అసలైన విజనరీ వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన సీఎం అయ్యాక విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థి లోకం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతోనే సెంట్రల్ యూనివర్సిటీ శాశ్వత భవనానికి ఒక రూపు వచ్చింది.