బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుళ్ల ఘటన నేపథ్యంలో మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. సోదాలు నిర్వహించి పిఎఫ్ఐ సభ్యుడైన సలీంను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలించారు. కాగా దీర్ఘాకాలంగా ఉగ్రవాద సంబంధాలున్న సలీంపై ఇప్పటికే రెండు లక్షల రివార్డు కూడా ఉంది.
తెలంగాణకు చెందిన సలీం మైదుకూరు మండలంలో చెర్లోపల్లిలో ఒక మదరసాలో బోధనలు చేయడానికి ఒక నెల క్రితం అక్కడికి వచ్చినట్లు సమాచారం. సలీంని స్థానిక మదరసాలో బోధకుడుగా నియమించికున్నారు. చెర్లోపల్లి వారికి సలీం ఉగ్రవాది అని తెలియదు. నిన్న ఎన్ఐఏ అక్కడికి వచ్చి సలీంను అదుపులోకి తీసుకునే వరకు ప్రజలు నివ్వెరపోయారు. ఉగ్రవాద సంస్థలతో సంభంధాలు కలిగిన సలీం మైదుకూరును అనువైన చోటుగా భావించి అక్కడికి మకాం మార్చాడు. బెంగళూరులో రామేశ్వరం కేఫ్ లో జరిగిన ఈ సంఘటనతో ఉగ్రవాద చర్యలు బయటపడ్డాయి.