ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తల్లి ఎల్లారెడ్డి లలితమ్మ మృతికి సంతాపం తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ రోజు మధ్యాహ్నం అనంతపురం జిల్లాలో జరిగే లలితమ్మ అంత్యక్రియలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు.
వైఎస్ కుటుంబాన్ని , ఎల్లారెడ్డి కుటుంబానికి ఎన్ని ఏళ్ల విడరాని ఆత్మీయ బంధం ఉంది. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మొదటగా వైయస్ఆర్ హయాంలో 2004 లో ఎమ్మెల్యే గా గెలిచారు. వైయస్ఆర్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం అంత జగన్ మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు.
బనగానపల్లి సభ అనంతరం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో రాంపురంరెడ్డి సోదరుల మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ అంత్యక్రియల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
మధ్యాహ్నం 2 గంటలకు కొనకొండ్ల చేరుకుని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి లలితమ్మ అంతిమసంస్కార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. ఆదోని, మంత్రాలయం, గుంతకల్లు ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు సీతారామిరెడ్డి ఆమె కుమారులు.