చంద్రబాబు అనుంగ శిష్యుడు, ఆయన కోసం ఎందాకైనా అంటూ ఏ కార్యాన్నైనా చక్కబెట్టే సీఎం రమేష్ తాజాగా మరో కేస్ లో ఇరుక్కున్నాడు.. పీసీఎల్ జాయింట్ వెంచర్ పేరుతో టాలీవుడ్ హీరో వేణు తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సీఎం రమేష్ తనను మోసం చేసి డాక్యుమెంట్ లను ఫోర్జరీ చేసి 450 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు అని హీరో వేణు తరపున కావూరి భాస్కర్ రావు హైదరాబాద్ లో కేస్ నమోదు చేశాడు..
2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం బీజేపీ ఆగ్రహానికి గురై ఎక్కడ తన అవినీతిని బయటపెట్టి జైలు పాలు చేస్తారో అనే భయం తో టీడీపీ రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ ను మరో టీడీపీ సభ్యుడైన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లతో సహా బిజెపి లోకి పంపాడు బాబు. తొలి నుండి సీఎం రమేష్, సుజనా చౌదరిలు బీజేపీ ని బాబుకు దగ్గర చేయడం కోసం చేయని ప్రయత్నాలు లేవు. బీజేపీ లో ఉన్నా మనసంతా టీడీపీ ని నింపుకున్న సీఎం రమేష్ టీడీపీ బాగుకోసమే పని చేస్తూ వచ్చాడు. బీజేపీ టీడీపీ తో పొత్తుకు అంగీకరించడానికి సీఎం రమేష్ ది కీలక పాత్ర..
తన వ్యాపార సంస్థ అయిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వివిధ పార్టీలకు 45 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చాడు. తన సొంత పార్టీ అయిన బీజేపీ కి ఇచ్చాడు అంటే అర్ధం ఉంది కానీ బీజేపీ బద్ధ శత్రువైన కాంగ్రెస్ కు ఏకంగా 30 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఇచ్చాడు. ఇక కర్ణాటక కు చెందిన తనకెలాంటి సంబంధం లేని జేడీఎస్ కు 10 కోట్లు, టీడీపీ కి 5 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఫండ్ ఇచ్చాడు.. బీజేపీ లో జాయిన్ అయ్యి దాదాపు వెయ్యికోట్లకి పైగా విలువ వేసే కాంట్రాక్టులు పొందిన సీఎం రమేష్ జాతీయ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు.
బాబు కోసం ఏ పార్టీ లో ఉన్నా తమ శాయ శక్తులూ ఒడ్డి పనిచేసే సీఎం రమేష్, కాంగ్రెస్ కు 30 కోట్ల ఫండ్ ఇవ్వడం తద్వారా ఏపీ లో కాంగ్రేస్ కార్యకలాపాలు మొదలవ్వడం, జగన్ వ్యతిరేకులు, బాబుకు అనుకూలురు ఎవ్వరైనా సరే సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కి చెందిన ప్రైవేటు విమానం లోనే ప్రయాణించడం పరిపాటి అయింది. ఎక్కడున్నా బాబు ప్రయోజనాలకే పెద్ద పీఠ వేస్తూ తన జేబు కూడా నిండా నింపుకున్న సీఎం రమేష్ యొక్క ముసుగు తొలగి ప్రజల ముందు నిజస్వరూపం బయటపడే సమయం ఆసన్నమైంది..